Viral Video: మనోడి నిర్వాకం చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం.. వంట చేయమంటే ఏకంగా టెంటునే కాల్చేశాడు..!
ABN , First Publish Date - 2023-12-08T20:29:19+05:30 IST
వంట చేయడమనేది ఓ కళ. అవగాహన ఉంటే వంట చేయడం చాలా ఈజీ. అదే అరకొర జ్ఞానంతో వంట చేయాలని ప్రయత్నిస్తే చివరకు అసలుకే ఎసరు వస్తుంది. కొందరు వంటింట్లో చేతకాని పనులు చేసి చివరకు చేతులు కాల్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...
వంట చేయడమనేది ఓ కళ. అవగాహన ఉంటే వంట చేయడం చాలా ఈజీ. అదే అరకొర జ్ఞానంతో వంట చేయాలని ప్రయత్నిస్తే చివరకు అసలుకే ఎసరు వస్తుంది. కొందరు వంటింట్లో చేతకాని పనులు చేసి చివరకు చేతులు కాల్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వంట చేయమంటే ఓ వ్యక్తి చివరకు ఏకంగా టెంటునే కాల్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పాకశాస్త్ర ప్రావీణ్యుడిలా వంట చేసేందుకు సిద్ధమవుతాడు. పొయ్యిపై పెద్ద పాత్ర ఏర్పాటు చేసి, వంట (cooking) చేసేందుకు సిద్ధమవుతాడు. బాణలిలోని వేసిన పదార్థాలన్నీ ఉడుకుతుంటాయి. ఈ క్రమంలో మరో పొయ్యి మీద చిన్న పాత్రలో నూనె పోసి పోపు పెడతాడు. దీంతో అందులో నుంచి మంటలు మొదలవుతాయి. మంట వస్తుండగానే పాత్రను తీసుకుని బాణలిలో వేస్తాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద మంట (fire) పుడుతుంది.
మంటలు చెలరేగడంతో అతడు భయపడిపోయి పాత్రను బాణలిలోనే పడేసి దూరంగా పరుగెడతాడు. మంటల దాటికి పైన ఉన్న టెంట్ కూడా కాలిపోతుంది. చివరకు నాలుక్కరుచుకున్న వ్యక్తి మెల్లగా బాణలి వద్దకు చేరుకుంటాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాక్కూడా వంట చేయొచ్చని నిరూపించావ్ బ్రదర్’’.. అని కొందరు, ‘‘ఇతడి వంట మాములుగా లేదుగా’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.