Video: హ్యాట్సాఫ్ బాస్.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించావ్.. శునకాలను వెతుక్కుంటూ వెళ్లి మరీ..!
ABN , First Publish Date - 2023-12-07T19:35:09+05:30 IST
మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు మొత్తం వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో...
మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు మొత్తం వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇక జంతువుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పట్టించుకునే వారే లేకపోవడంతో వాటి బాధ వర్ణణాతీతంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి మానవత్వం చాటుకున్నాడు. శునకాలను వెతుక్కుంటూ వెళ్లి మరీ కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల (Heavy rains) కారణంగా చెన్నై (Chennai) నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు అప్రమత్తమై లోతట్టుప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే జంతువుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ సమయంలో ఓ వ్యక్తి చేసిన పని చూసి అంతా శభాష్.. అంటూ మెచ్చుకుంటున్నారు. వరద నీటిలో చిక్కుకున్న కుక్కలను (dogs) కాపాడేందుకు రంగంలోకి దిగాడు.
Viral Video: మిడిల్ ఫింగర్ చూపించిన యాంకర్.. కెమెరాలో రికార్డు అవుతోందని తెలియదంటూ క్షమాపణలు..
వరద నీరు నిలిచిన ప్రాంతాల్లోకి వాహనంతో వెళ్లారు. నీటిలో చిక్కుకున్న వీధి కుక్కలన్నింటినీ తమ వాహనంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘శభాష్ బ్రదర్.. చాలా మంచి పని చేశావ్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వాళ్లు.. చాలా అరుదుగా ఉంటారు’’.. అంటూ మరికొందరు, ‘‘మూగజీవాల పాలిట దేవుడిలా వచ్చాడు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.