Anand Mahindra Tweet: ఈ చింపాంజీ మనకు పెద్ద జీవిత పాఠమే నేర్పిందంటున్న మహీంద్రా.. వైరల్‌ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-08-22T12:48:51+05:30 IST

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Anand Mahindra Tweet: ఈ చింపాంజీ మనకు పెద్ద జీవిత పాఠమే నేర్పిందంటున్న మహీంద్రా.. వైరల్‌ అవుతున్న వీడియో!

Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన వాటిని ఇలా సామాజిక మాధ్యమాల (Social Media) ద్వారా నెటిజన్లతో పంచుకుంటారు. వాటిల్లో కొన్ని మానవ సంబంధాలను తెలియజేసేవి, మరికొన్ని సృజనాత్మకతను బయటపెట్టేవి, ఇంకొన్ని విజ్ఞానం పంచేవి ఉంటాయి. ఇదే కోవలో తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఒక చింపాంజీ వీడియో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియో మనకు పెద్ద జీవిత పాఠం అని మహీంద్రా చెప్పుకొచ్చారు కూడా.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో మనిషితో పాటు ఓ చింపాంజీ కనిపిస్తుంది. అందులోని ఆ కామెరూన్ చింపాంజీ (Chimpanzee in Cameroon) ఓ ఫొటోగ్రాఫర్‌ (Photographer) ను నీరు తాగడానికి సాయం కోరడం మనం చూడొచ్చు. అలా అతని చేతులతో నీరు తాగిన తర్వాత చింపాంజీ చేసిన పని ఉంది చూడండి.. అది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. నీరు తాగిన తర్వాత ఆ వ్యక్తి చేతుల్ని చింపాంజీ ఎంచక్కా శుభ్రం చేయడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన మహీంద్రా.. "ఇది ఒక ఉపయోగకరమైన జీవిత పాఠం. మీరు విజయం సాధించాలంటే మీ బృందంలోని సభ్యులకు సాయం చేయండి. వారికి మద్ధతుగా ఉండండి. తిరిగి వారి సపోర్ట్ మీకు లభిస్తుంది" అని రాసుకొచ్చారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 1.8 మిలియన్ల వ్యూస్, 27వేల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరు చింపాంజీ వీడియోపై ఓ లుక్కేయండి.

Viral Video: ఈ బుడ్డోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడాలేక.. పడిన తిప్పలు ఉన్నాయి చూడండి.. నవ్వు ఆపుకోలేరు..!


Updated Date - 2023-08-22T12:48:51+05:30 IST