Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వేగంగా వెళ్తున్న బైక్ మీద వికృత చేష్టలు..!

ABN , First Publish Date - 2023-09-17T13:17:20+05:30 IST

ఈ మధ్య ప్రేమ జంటల బరితెగింపులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో వికృత చేష్టలకు పాల్పడడం ప్రధానంగా ఆ వీడియోలలో కనిపిస్తుంది.

Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వేగంగా వెళ్తున్న బైక్ మీద వికృత చేష్టలు..!

Viral Video: ఈ మధ్య ప్రేమ జంటల బరితెగింపులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో వికృత చేష్టలకు పాల్పడడం ప్రధానంగా ఆ వీడియోలలో కనిపిస్తుంది. అందులోనూ కదులుతున్న వాహనాలపై ముద్దు, కౌగింతలలో మునిగిపోవడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి చాలా వీడియోలు బయటకు వచ్చాయి కూడా. తాజాగా ఇదే కోవలో రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ (Jaipur) లో ఓ ఘటన జరిగింది. దాని తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వేగంగా వెళ్తున్న బైక్ మీద ఓ ప్రేమ జంట (Lovers) రెచ్చిపోయింది. ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ (Kissing Stunt) చేస్తూ కెమెరా కంటికి చిక్కింది.

ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పోలీస్ అధికారులు సదరు ప్రేమ జంటపై చర్యలకు ఆదేశించారు. వీడియోలోని దృశ్యాలను పరిశీలిస్తే.. వేగంగా వెళ్తున్న బైక్‌ (Bike) పై యువతి, యువకుడు ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం వీడియోలో ఉంది. జైపూర్‌లోని దుర్గాపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. వీడియో బయటకు రావడం, పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో ఆ లవ్ బర్డ్స్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు.

Viral Video: విషాదకర వార్త చదువుతూ.. ఈ యాంకరమ్మ ఏం చేసిందో మీరే చూడండి..!

Updated Date - 2023-09-17T13:22:33+05:30 IST