CCTV Video: మనసు మార్చుకున్న దొంగ.. వినాయక మండపంలోకి మళ్లీ తిరిగొచ్చి హుండీలో మిగిలిన డబ్బుల్ని కూడా..!

ABN , First Publish Date - 2023-09-26T15:03:42+05:30 IST

ఉత్సవాలు, పండుగల సమయంలో ఓవైపు భక్తులు హడావుడిలో ఉంటే.. మరోవైపు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. మన పక్కనే ఉంటూ మనక్కూడా తెలీకుండా పర్సులు, ఫోన్లు కొట్టేయడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి..

CCTV Video: మనసు మార్చుకున్న దొంగ.. వినాయక మండపంలోకి మళ్లీ తిరిగొచ్చి హుండీలో మిగిలిన డబ్బుల్ని కూడా..!

ఉత్సవాలు, పండుగల సమయంలో ఓవైపు భక్తులు హడావుడిలో ఉంటే.. మరోవైపు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. మన పక్కనే ఉంటూ మనక్కూడా తెలీకుండా పర్సులు, ఫోన్లు కొట్టేయడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్రలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ వినాయక మండపంలోకి మళ్లీ హుండీలో నగదు ఎత్తుకెళ్లాడు. ఇదిలావుండగా, సీసీ ఫుటేజీ చూసి స్థానికులతో పాటూ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని (Maharashtra) అకోలా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి పండుగను (Vinayaka Chavithi festival) పురస్కరించుకుని స్థానికంగా పెద్ద వినాయకుడి విగ్రహాన్ని (Ganesha Statue) ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుండడంతో ఓ దొంగ కన్ను ఈ ప్రాంతంపై పడింది. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం రెండు గంగల సమయంలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చాడు. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పాటూ అక్కడ సిబ్బంది కూడా గుడి బయట ఏదో పనిలో ఉండడంతో ఇదే మంచి తరుమని భావించాడు. స్వామిని దర్శించుకున్నట్లు నటించాడు. ఈ క్రమంలో విగ్రహం ఎదురుగా ఉన్న హుండీని తెరిచాడు. లోపల ఉన్న నగదును (thief stole money from hundi) తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఎందుకో హుండీలో కొంత నగదును అలాగే ఉంచి వెళ్లాడు.

Viral Video: పాములతో జాగ్రత్తగా ఉండాలనేది ఇందుకే.. బైక్‌లో వెళ్తున్న ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..

అయితే తీరా గుడి బయటికి వెళ్లిన వాడు మళ్లీ మనసు మార్చుకున్నాడు. హుండీ మొత్తం ఖాళీ చేస్తే పోలా.. అనుకున్నాడే ఏమో గానీ, మళ్లీ వెనక్కు వచ్చి హుండీలో చిల్లర మినహా నోట్లన్నీ తీసుకుని వెళ్లిపోయాడు. దొంగ వెళ్లిన కాసేపటికి లోపలికి వచ్చిన స్థానికులకు అనుమానం వచ్చి హుండీలో చూడగా నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడి సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించగా విషయం బయటపడింది. మొత్తం రూ.16,000 వరకు చోరీ జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, చోరీలను దృష్టిలో ఉంచుకుని మంటపాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించాలంటూ స్థానికులు కోరుతున్నారు. కాగా, ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?

Updated Date - 2023-09-26T15:03:42+05:30 IST