Viral Video: అర్ధరాత్రి షాకింగ్ సీన్.. ఓ యువతిని ఈడ్చుకుంటూ వెళ్తున్న యువకుడు.. అసలు కారణం తెలిసి అవాక్కైన పోలీసులు..!
ABN , First Publish Date - 2023-09-26T15:51:23+05:30 IST
నేటి సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలై.. జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరైతే పబ్బుల పేరుతో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువ శాతం యువతులు కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో...
నేటి సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలై.. జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరైతే పబ్బుల పేరుతో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువ శాతం యువతులు కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చేసుకుంటుంటాయి. తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువకుడు అర్ధరాత్రి ఓ యువతిని ఈడ్చుకుంటూ వెళ్లడం.. సీసీ కెమెరాల్లో రికార్డైంది. చివరకు అసలు కారణం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కొందరు యువతీయువకులు.. సెప్టెంబర్ 23 రాత్రి రిడ్జ్ మైదానంలోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ ఫుల్‌గా మద్యం సేవించారు. అర్ధరాత్రి వారిలో ఓ యువకుడు, యువతి (young woman) కలిసి పబ్ నుంచి బయటికి వచ్చారు. అయితే ఇంటికి వెళ్లే సమయంలో ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త వారి మధ్య వివాదానికి దారి తీసింది. దీంతో చివరకు యువతి ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. అయితే యువకుడు మాత్రం ఇంటికి రావాలంటూ ఆమెను బలవంతం చేశాడు. అయినా యువతి మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో (young man dragged his girlfriend) చివరకు ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో కింద పడ్డ ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లాడు. విడింపించుకుని పారిపోతున్నా వదలకుండా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. కాసేపటికి స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ యువతికి చికిత్స చేయించారు. తాము ఇద్దరం స్నేహితులమని, కొన్ని కారణాల వల్ల గొడవ జరిగిందని చెప్పారు. అతడిపై ఫిర్యాదు చేసేందుకు యువతి నిరాకరించింది. అయితే ఘటనా స్థలంలోని దుకాణదారుడు.. సీసీ కెమెరా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పోలీసులు స్పందించి వీడియోను డిలీట్ చేయించినా.. అప్పటికే చాలా మంది ఈ వీడియోను (Viral video) షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?