తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో భార్య.. మెట్లపై నుంచి పడిందన్న భర్త.. మెలకువ వచ్చాక ఆమె చెప్పింది విన్న డాక్టర్లకు..!
ABN , First Publish Date - 2023-03-16T19:38:15+05:30 IST
భర్త ఆదాయం అంతంతమాత్రమే కావడంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తానూ ఉద్యోగం చేస్తే.. ఇంటి ఖర్చులకు ఇబ్బంది ఉండదని భార్య నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. ఉన్నట్టుండి తలకు తీవ్ర గాయాలతో..
భర్త ఆదాయం అంతంతమాత్రమే కావడంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తానూ ఉద్యోగం చేస్తే.. ఇంటి ఖర్చులకు ఇబ్బంది ఉండదని భార్య నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. ఉన్నట్టుండి తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరింది. మెట్లపై నుంచి కింద పడిందని భర్త చెప్పాడు. అయితే మెలకువ వచ్చాక ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఢిల్లీ (Delhi) ప్రేమ్‌నగర్ పరిధికి చెందిన కాజల్ అనే మహిళకు కొన్నేళ్ల కిందట ప్రవీణ్ కుమార్‌తో వివాహం (marriage) జరిగింది. ప్రవీణ్ కుమార్ సివిల్ డిఫెన్స్‌లో (Civil Defence) పని చేస్తుంటాడు. వివాహ సమయంలో అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. అయితే పెళ్లయిన కొన్నేళ్లకు ప్రవీణ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు (quarrels) తలెత్తాయి. ఈ క్రమంలో అన్న మరియు తల్లిదండ్రులు కలిసి.. ప్రవీణ్ దంపతులను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో అప్పటి నుంచి వారు స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రవీణ్‌కు రూ.20వేల జీతం వస్తుండగా... అందులో రూ.10వేలను తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. మిగతా రూ.10వేలు ఇంటి అద్దె తదితరాలకు ఖర్చయ్యేవి.
ఆదాయం అంతంతమాత్రమే కావడంతో ప్రవీణ్ దంపతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు (Financial problems) పడేవారు. ఏదైనా ఉద్యోగం చేస్తే ఖర్చులకు ఇబ్బంది ఉండదని కాజల్ నిర్ణయించుకుంది. అయితే కోడలు ఉద్యోగం చేయడం అత్తమామలతో పాటూ ప్రవీణ్ అన్నకూ ఇష్టం లేదు. ఎంత చెప్పినా ఉద్యోగ ప్రయత్నాలు (Job attempts) చేస్తుండడంతో కోడలిపై కోపం పెంచుకున్నారు. ఇటీవల ఓ రోజు ప్రవీణ్ సోదరుడు.. కాజల్‌పై ఇటుక రాయితో దాడికి (attack) పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. గాయపడ్డ భార్యను ప్రవీణ్.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. తన భార్య కాలు జారి మెట్లపై నుంచి కిందపడిందని చెప్పాడు. ఈ దాడిలో ఆమె తలకు 17కుట్లు పడ్డాయి. అయితే స్పృహలోకి వచ్చిన ఆమె.. జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.