Viral Video: ప్రియురాలికి పువ్వు ఇచ్చి ప్రేమగా ప్రపోజ్ చేశాడు.. అయితే ఉన్నట్టుండి ఆమె ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే..
ABN , First Publish Date - 2023-03-15T21:17:21+05:30 IST
ప్రస్తుత హైటెక్ యుగంలో చదువుకునే విద్యార్థులు కూడా ప్రేమ ప్రేమ అంటూ వెంటపడడం, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. కొందరైతే మరీ దారుణంగా దాడులకూ తెగబడుతుంటారు. మరోవైపు కొందరు విద్యార్థులు.. సోషల్ మీడియాలో..
ప్రస్తుత హైటెక్ యుగంలో చదువుకునే విద్యార్థులు కూడా ప్రేమ ప్రేమ అంటూ వెంటపడడం, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. కొందరైతే మరీ దారుణంగా దాడులకూ తెగబడుతుంటారు. మరోవైపు కొందరు విద్యార్థులు.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ (students Viral videos) అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి ఏకంగా స్కూల్లోనే విద్యార్థినికి పువ్వు ఇచ్చి మరీ లవ్ ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె ఉన్నట్టుండి ఇచ్చిన రెస్పాన్స్ చూసి చివరకు షాక్ అవుతాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ పాఠశాల క్లాస్ రూమ్‌లో (School class room) విద్యార్థులంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ విద్యార్థి వీడియో ఆన్ చేయగా.. మరో విద్యార్థి చేతిలో పువ్వు పట్టుకుని అక్కడికి వస్తాడు. నేరుగా ముందుకు వచ్చి బాలిక (girl) ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. చేతిలోని పువ్వును ఇచ్చి ప్రేమగా లవ్ ప్రపోజ్ (Love proposal) చేయాలని చూస్తాడు. ఐ లవ్ యూ (i love you).. అని చెప్పీ చెప్పగానే వెంటనే ఆమె రియాక్ట్ అవుతుంది.
అతడి చెంప మీద ఫెడేల్‌మని గట్టిగా ఒక్క దెబ్బ కొడుతుంది. దీంతో అప్పటిదాకా లవ్ డ్రీమ్స్‌లో బాలుడికి ఒక్కసారిగా చుక్కలు కనపడతాయి. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. చదువుకునే వయసులో ప్రేమ అంటూ తిరగడం చూస్తుంటే.. సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు.. అని కొందరు, ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.. అని మరికొందరు, పిచ్చి పిచ్చి పనులు పక్కన పెట్టి.. బుద్ధిగా చదువుకోండి.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.