హనీమూన్‌లో మొదటి రాత్రికి ముందే వధువుకు ఫోన్.. కాసేపటికి తనకూ ఫోన్ రావడంతో బయటికి వెళ్లిన భర్త.. గంటల వ్యవధిలోనే..
ABN , First Publish Date - 2023-03-15T17:24:00+05:30 IST
అతిథులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం అందరిలాగానే వీరు కూడా హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హనీమూన్ కార్యక్రమం పూర్తవకుండానే..
అతిథులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం అందరిలాగానే వీరు కూడా హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హనీమూన్ కార్యక్రమం పూర్తవకుండానే అనూహ్య ఘటన చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. హనీమూన్‌లో మొదటి రాత్రికి ముందే వధువుకు ఫోన్ వచ్చింది. కాసేపటికి భర్తకూ ఫోన్ రావడంతో బయటికి వెళ్లాడు. గంటల వ్యవధిలోనే జరిగిన ఘటనకు స్థానికులంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధి ఘతంపూర్ ప్రాంతానికి చెందిన సర్వేష్ అనే వ్యక్తికి.. స్థానిక ప్రాంతానికి చెందిన యువతితో (young woman) 2022 మే 17న వివాహమైంది. అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి (marriage) చేసుకున్న దంపతులు.. అంతే ఆర్భాటంగా హనీమూన్‌కి కూడా ప్లాన్ చేసుకున్నారు. మే 19న హనీమూన్ వెళ్లాలని సర్వేష్ నిర్ణయించుకున్నాడు. అయితే హనీమూన్ (Honeymoon) కార్యక్రమం పూర్తవకుండానే వీరి కుటుంబంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హనీమూన్ సందర్భంగా ఈ దంపతుల మొదటి రాత్రికి ముందే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: పాము, ముంగిస మధ్య బిగ్ ఫైట్.. ఆశ్చర్యకరంగా చివర్లో ఇలా జరిగిందేంటీ..
రాత్రి నవ వధువు (new bride) భర్త వద్ద ఉండగా.. ఆమె ఫోన్‌కు ఎవరో ఫోన్ చేశారు. అలాగే మెసేజ్ కూడా చేశారు. తర్వాత కాసేపటికి భర్తకు కూడా ఫోన్ వచ్చింది. దీంతో ఎవరో ఏంటో కనుక్కుందామని అతను.. రాత్రి వేళ బయటికి వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. ఉదయం వారి ఉంటున్న ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్ (Railway line) వద్ద శవమై కనిపించాడు. వివాహమై రోజులు కూడా గడవక ముందే కొడుకు ఇలా విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కొడుకును ఎవరో కావాలనే హత్య చేశారని ఆరోపించారు. ఇందులో తమ కోడలి హస్తం కూడా ఉందన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంత వరకూ నేరస్థులను గుర్తించలేకపోయారు. దీంతో ఇటీవల వారు పోలీసు ఉన్నతాధికారులను (Police officers) సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ స్థానిక పోలీసులను వారు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.