Share News

Viral News: పాపం.. ఈ విమానం ఎక్కిన వాళ్ల పరిస్థితి ఏంటో.. కుక్కలకు పెట్టే ఆహారాన్నే ప్రయాణీకులకు కూడా..!

ABN , First Publish Date - 2023-11-23T20:53:54+05:30 IST

రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు ఎంచుకున్న కేటగిరీని బట్టి వారికి వివిధ రకాల ఫుడ్‌ను అందించడం చూస్తూ ఉంటాం. ఇక విమానాల్లో ఎలాంటి ఫుడ్ అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని విమానాల్లో అత్యంత ఖరీదు చేసే వివిధ రకాల వంటకాలను అందిస్తుంటారు. అలాగే ...

Viral News: పాపం.. ఈ విమానం ఎక్కిన వాళ్ల పరిస్థితి ఏంటో.. కుక్కలకు పెట్టే ఆహారాన్నే ప్రయాణీకులకు కూడా..!

రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు ఎంచుకున్న కేటగిరీని బట్టి వారికి వివిధ రకాల ఫుడ్‌ను అందించడం చూస్తూ ఉంటాం. ఇక విమానాల్లో ఎలాంటి ఫుడ్ అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని విమానాల్లో అత్యంత ఖరీదు చేసే వివిధ రకాల వంటకాలను అందిస్తుంటారు. అలాగే బిజినెస్ క్లాసులో వెళ్లే ప్రయాణికులకు.. ఆహార ఏర్పాట్లు కూడా అందుకు తగ్గ స్థాయిలోనే ఉంటాయి. అయితే తాజాగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ విమానంలో ప్రయాణికులకు కుక్కలకు పెట్టే ఆహారాన్ని పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఓ ప్రయాణికుడికి చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ విమానంలో (China Eastern Airline flight) ఊహించని అనుభవం ఎదురైంది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న అతడికి.. విమాన సిబ్బంది ఫుడ్ మెనూ (Flight food menu) అందజేశారు. అందులోని వివరాలను పరిశీలిస్తున్న అతడు.. ఓ ఫుడ్ డిటైల్స్ చూసి ఖంగుతిన్నాడు. ఆ మెనూలో సూప్‌, రొట్టెలు, వనిల్లా రొయ్యలు, కాల్చిన స్టీక్ తదితర అనేక రకాల ఆహార పదార్థాల వివరాలు రాసి ఉన్నాయి. అయితే మెనూలో పైభాగంలో రాసింది చూసి అతను ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ‘‘ఇంపోర్టెడ్ డాగ్ ఫుడ్’’.. అని రాసి ఉండడం చూసి అవాక్కయ్యాడు.

Viral Video: నన్నెవరో కిడ్నాప్ చేశారంటూ విమానంలో ఓ మహిళ రచ్చ రచ్చ.. సీట్లపైకి ఎక్కి దూకుతూ..!

plane-food.jpg

అంత ఖరీదైన బిజినెస్ క్లాసులో ఇలాంటి ఫుడ్ అందిస్తున్నారేంటీ.. అని అనుకుని దాన్ని ఫొటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో (Viral photos) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయితే ఎకానమీ క్లాస్ ప్రయాణికులు దేశీయ కుక్కల ఫుడ్ మాత్రమే ఇస్తారన్నమాట’’.., ‘‘ఎంతైనా బిజినెస్ క్లాస్ ప్రయాణం మరి’’.., ‘‘పెంపుడు జంతువులకు అనుకూలమైన విమానం’’.., ‘‘కుక్క మాసం కంటే.. ఈ కుక్క ఫుడ్ బెటర్’’.., ‘‘చైనీస్ ప్రజలు కుక్కల ఆహారంతో పెరిగారేమో’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ దెబ్బకు.. ఆ కంపెనీయే దివాళా తీసేట్టుందిగా.. ఆటో వెనుక అసలేం రాశాడో చూస్తే..!

Updated Date - 2023-11-23T20:53:58+05:30 IST