16 ఏళ్ల కూతురిని రాత్రి చంపేశాడు.. పొద్దున్నే ఏమీ ఎరుగనట్టు జాబ్‌కు వెళ్లిపోయాడు.. పక్కింటోళ్లకు కూడా డౌట్ రాలేదు కానీ ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో..
ABN , First Publish Date - 2023-03-03T16:21:53+05:30 IST
కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెడుతుంటారు. అలాగే ఇంకొందరు తల్లిదండ్రులు.. పిల్లల ప్రేమను అర్థం చేసుకోకుండా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..
కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెడుతుంటారు. అలాగే ఇంకొందరు తల్లిదండ్రులు.. పిల్లల ప్రేమను అర్థం చేసుకోకుండా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 16 ఏళ్ల కూతురిని రాత్రి చంపి.. ఉదయం ఏమీ ఎరుగనట్లు డ్యూటీకి వెళ్లిపోయాడు. పక్కింటోళ్లకు కూడా డౌట్ రాలేదు. కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో చివరకు ఏమైందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్‌పత్ చాందినగర్ సమీపంలోన పంచి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తికి.. నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో జియా(16) అనే బాలిక (16 year old girl) అందరికంటే పెద్దది. ప్రమోద్ స్థానికంగా హోంగార్డుగా (home guard) పని చేస్తుంటాడు. ఇలావుండగా, పదో తరగతి చదువుతున్న బాలిక.. చదవడంపై దృష్టి పెట్టకుండా తరచూ స్థానికంగా ఉండే యువకుడితో ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు తండ్రి కంటపడింది. దీంతో ప్రమోద్ తన కూతుర్ని గట్టిగా మందలించాడు. ఇంకోసారి ఇలా చేయకుండా.. చదువుపై దృష్టి పెట్టాలంటూ సూచించాడు. అయితే జియా ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ యువకుడితో తన కూతురు కలిసి ఉండడాన్ని ప్రమోద్ గమనించాడు.
దీంతో కూతురుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే జియా మాత్రం సదరు యువకుడితో మాట్లాడుతూనే ఉండేది. ఫిబ్రవరి 23న కూడా ప్రియుడితో (boyfriend) ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ప్రమోద్ కోపం కట్టలు తెంచుకుంది. కూతురుపై విచక్షణా రహితంగా దాడి (attack) చేయడంతో అక్కడికక్కడే మృతి (Death) చెందింది. తర్వాత కూతురు మృతదేహాన్ని.. సోదరుడు మోహిత్‌తో కలిసి సమీపంలో ఓ నదిలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు డ్యూటీకి వెళ్లిపోయాడు. మార్చి 1న గుర్తు తెలియని వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.