Viral Video: బుల్లెట్ బండి ఉంది కదా అని మరీ ఈ పైత్యమేంటీ.. ఇతడి నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2023-07-28T21:50:06+05:30 IST

డబ్బులున్నాయి కదా అని అందరిలో దాబు.. దర్పం చూపిస్తూ కొందరు, పది మందిలో హీరో అనిపించుకోవాలని మరికొందరు, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇంకొందరు పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఈ తరహా...

Viral Video: బుల్లెట్ బండి ఉంది కదా అని మరీ ఈ పైత్యమేంటీ.. ఇతడి నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు.. చివరకు ఏమైందంటే..

డబ్బులున్నాయి కదా అని అందరిలో దాబు.. దర్పం చూపిస్తూ కొందరు, పది మందిలో హీరో అనిపించుకోవాలని మరికొందరు, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇంకొందరు పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఈ తరహా ఘటనలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బుల్లెట్ బండిపై పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్నట్టుండి అతడు చేసిన నిర్వాకం ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమ్రోహా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బుల్లెట్ బైక్ వేసుకుని పెట్రోల్ బంక్ (Petrol Bunk) వద్దకు వెళ్లాడు. అక్కడ తానే స్వయంగా పెట్రోల్ పట్టుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. బండికి ఫుల్ ట్యాంక్ పట్టిన అతను.. పెట్రోల్ పొంగి బయటకు వస్తున్నా ఆపలేదు. అంతటితో ఆగకుండా (man sprinkled petrol on bullet bike) బండిపై పెట్రోల్ మొత్తాన్ని చల్లేశాడు. అదేదో నీళ్లతో బైకును కడిగుతున్నట్లుగా పెట్రోల్ పోశాడు.

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసిందిగా..!

ఈ ఘటనతో అక్కడే ఉన్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటీ పని అంటూ ప్రశ్నిస్తున్నా సదరు యువకుడు వినిపించుకోలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో యువకుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతన్నారు. ‘‘రీల్స్ కోసం పక్క వారి ప్రాణాలతో ఆడుకోవద్దు’’.. అంటూ కొందరు, ‘‘ఇది మరీ టూ మచ్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

Updated Date - 2023-07-28T21:50:06+05:30 IST