WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసిందిగా..!
ABN , First Publish Date - 2023-07-28T18:53:00+05:30 IST
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగించే యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఎవరికి ఏ మెసేజ్ చేయాలన్నా.. వెంటనే వాట్సప్‌లోకి వెళ్లడం సర్వసాధారణమైపోయింది. యూజర్లకు అనుకూలంగా వాట్సప్ యాజమాన్యం కూడా వివిధ ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. దశలవారీగా...
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగించే యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఎవరికి ఏ మెసేజ్ చేయాలన్నా.. వెంటనే వాట్సప్‌లోకి వెళ్లడం సర్వసాధారణమైపోయింది. యూజర్లకు అనుకూలంగా వాట్సప్ యాజమాన్యం కూడా వివిధ ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. దశలవారీగా వాయిస్ మెసేజ్, వీడియో కాలింగ్, స్టేటస్.. ఇలా అనేక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వాట్సప్ యూజర్లకు మరో కొచ్చ ఫీచర్ అందుబాటులోకి తెచ్చామంటూ.. కంపెనీ మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
వాట్సప్ యాప్ మరో కొత్త ఫీచర్‌తో (WhatsApp New Feature) మన ముందుకొచ్చింది. ఈ కొత్త ఫీరచర్ ఎలా పని చేస్తుందో వివరిస్తూ మెటా సీఈవో జూకర్‌బర్గ్ (Meta CEO Mark Zuckerberg) .. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. టెక్స్ట్ బాక్స్ పక్కనే వీడియో రికార్డ్ చిహ్నం ఉంటుంది. దీని సాయంతో వాయిస్ మెసేజ్‌లు ఎలా అయితే పంపిస్తామో.. అలాగే వీడియో సందేశాలను కూడా పంపించుకోవచ్చు. అయితే ఒకసారి 60 నిడివి మాత్రమే రికార్డు చేయవచ్చు. శుభవార్తలు, శుభాకాంక్షలు తెలిపేందుకు వీడియో సందేశాలను వినియోగించవచ్చు.
Viral Video: ఈ శునకానికి మస్తు టాలెంట్ ఉందిగా.. గేదెపైకి ఎక్కి నిల్చుని ఎలా వస్తోందో మీరే చూడండి..!
ఈ వీడియో కూడా సందేశం లాగానే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే పంపబడిన వీడియో సౌండ్ లేకుండా ప్లే అవుతుంది. సౌండ్ కావాలంటే.. వీడియోపై ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ (Android, iOS) వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ అప్‌డేట్‌ను మ్యాన్యువల్‌గా పొందేందుకు ప్లేస్టోర్, యాప్ స్టోర్‌ని (Playstore, App Store) సందర్శించండి.