Father: అప్పుడే పుట్టిన కూతురిని చెత్త కుప్పలో పారేసిన తండ్రి.. డాక్టర్‌కు చూపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి మరీ..!
ABN , First Publish Date - 2023-12-07T17:20:18+05:30 IST
ఓ మహిళ.. తన భర్త చనిపోవడంతో నలుగురు పిల్లలను పోషించుకుంటూ ఒంటరిగా జీవిస్తుండేది. ఇంతలో ఆమె జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. తన భార్య కూడా చనిపోయిందని చెప్పి దగ్గరయ్యాడు. చివరకు సదరు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో...
ఓ మహిళ.. తన భర్త చనిపోవడంతో నలుగురు పిల్లలను పోషించుకుంటూ ఒంటరిగా జీవిస్తుండేది. ఇంతలో ఆమె జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. తన భార్య కూడా చనిపోయిందని చెప్పి దగ్గరయ్యాడు. చివరకు సదరు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే అప్పటిదాకా బాగా చూసుకున్న భర్త.. ఒక్కసారిగా శాడిస్టుగా మారిపోయాడు. అప్పుడే పుట్టిన కూతురిని డాక్టర్‌కు చూపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి చెత్త కుప్పలో పారేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
హర్యానాలోని (Haryana) ఫరీదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీలోని (UP) అలీఘర్‌కు చెందిన నీతూ భర్త వేదరామ్.. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అలీఘర్ ప్రాంతానికి చెందిన పవన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన భార్య చనిపోయిందని, ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని తనని తాను నీతూకు పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఏడాది క్రితం నీతూను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫరీదాబాద్‌లోని జుజ్రు అనే ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇటీవల నీతూ గర్భవతి అయింది.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆమెను బల్లభ్‌గఢ్‌లోని సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే సోమవారం వేకువజాము ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో.. తల్లీబిడ్డను మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే ఈ క్రమంలో శిశువును డాక్టర్‌కు చూపిస్తానంటూ తీసుకెళ్లిన పవన్.. మార్గమధ్యలో పొదల్లో పడేసి వెళ్లాడు. పాప, భర్త కోసం ఆస్పత్రిలో ఎంత సేపు వేచి చూసినా అతను రాలేదు. చివరకు ఆమె డిశ్చార్చి అవగానే ఇంటికి వెళ్లి భర్తకు ఫోన్ చేసింది. ‘‘పాప చనిపోవడంతో పొదల్లో పూడ్చిపెట్టాను’’.. అని చెప్పడంతో నీతూకు అనుమానం కలిగింది. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాద చేసింది. అప్పటికే పొదల్లో ఏడుస్తూ ఉన్న శిశువును స్థానికులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం శిశువుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.