Viral Video: సైకిల్‌పై వెళ్తున్న బాలిక చున్నీని ఆకతాయి లాగడంతో.. అంతా చూస్తుండగానే సడన్‌గా..

ABN , First Publish Date - 2023-09-16T21:16:00+05:30 IST

స్కూలు నుంచి సంతోషంగా ఇంటికి వస్తున్న ఆ బాలిక.. పాపం తనకు అదే చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయింది. తన మానాన తాను సైకిల్‌పై వస్తున్న బాలికను చూసి ఆకతాయి తన శాడిజాన్ని చూపించాడు. బాలిక చున్నీని పట్టుకుని లాగడంతో అంతా చూస్తుండగా ఒక్కసారిగా..

Viral Video: సైకిల్‌పై వెళ్తున్న బాలిక చున్నీని ఆకతాయి లాగడంతో.. అంతా చూస్తుండగానే సడన్‌గా..

స్కూలు నుంచి సంతోషంగా ఇంటికి వస్తున్న ఆ బాలిక.. పాపం తనకు అదే చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయింది. తన మానాన తాను సైకిల్‌పై వస్తున్న బాలికను చూసి ఆకతాయి తన శాడిజాన్ని చూపించాడు. బాలిక చున్నీని పట్టుకుని లాగడంతో అంతా చూస్తుండగా ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యూపీలోని (UP) అంబేద్కర్‌నగర్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల పూజా అనే బాలిక (14-year-old girl) శనివారం స్కూలు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తోంది. తోటి విద్యార్థితో కలిసి మాట్లాడుకుంటూ రోడ్డు పక్కగా వస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు బైకుపై ఫాలో అవుతూ వీరిని గమనిస్తున్నారు. కొంత దూరం ఫాలో చేసి.. చివరికి బాలికను ఓవర్‌టేక్ చేసే సమయంలో బైకుపై వెనుక కూర్చున్న ఆకతాయి.. ఆమె చున్నీని లాగాడు. దీంతో ఒక్కసారిగా బాలిక బ్యాలెన్స్ తప్పి రోడ్డు మధ్యలోకి వెళ్లి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో బైకు బాలికను (bike hit the girl) బలంగా ఢీకొంది. బాలిక తల పైనుంచి బైకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

Buying a Car: కారును కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ముందే ఈ 20/4/10 రూల్‌ను తెలుసుకోండి..!

ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న మరో బైకు కూడా ప్రమాదానికి గురైంది. బాలిక కిందపడగానే పక్కనే వస్తున్న మరో బాలిక సైకిల్ ఆపి, కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లి చూసింది. అయితే అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన చుట్టుపక్కల వారు అక్కడ గుమికూడారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆకతాయిల అల్లరి చేష్టలకు అణ్యంపుణ్యం ఎరుగని బాలిక బలవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకున్నారు. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలిక మృతి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకతాయిల చేష్టలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి కారును ఇండియాలో మాత్రమే చూడగలం.. ఇంతకీ ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవడం ఖాయం..

Updated Date - 2023-09-16T21:16:00+05:30 IST