Woman: చెట్ల పొదల్లో యువతి మృతదేహం.. ఆమె ఫొటోను ఫేస్‌బుక్‌లో చూసి తల్లిదండ్రులకు ఫోన్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-09-15T19:24:01+05:30 IST
వివాహేతర సంబంధాల విషయంలో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. యువతులకు ఏవేవో మాటలు చెప్పి నమ్మించే చాలా మంది చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. అవసరం తీరాక వారిని వదిలించుకునేందుకు వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి...
![Woman: చెట్ల పొదల్లో యువతి మృతదేహం.. ఆమె ఫొటోను ఫేస్‌బుక్‌లో చూసి తల్లిదండ్రులకు ఫోన్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!](https://media.andhrajyothy.com/media/2023/20230730/young_women_crime_cb06b7391a.jpg)
వివాహేతర సంబంధాల విషయంలో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. యువతులకు ఏవేవో మాటలు చెప్పి నమ్మించే చాలా మంది చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. అవసరం తీరాక వారిని వదిలించుకునేందుకు వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. చెట్ల పొదల్లో యువతి మృతదేహం బయటపడింది. ఆమె ఫొటోను చూసి కొంత మంది తల్లిదండ్రలకు ఫోన్ చేయడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్‌కు చెందిన ముస్కాన్ అలియాస్ రూపవతి అనే యువతి (young woman) స్థానికంగా ఉండే చీరల దుకాణంలో పని చేస్తుండేది. ఏడాది క్రితం ఈమెకు జితేంద్ర సాహ్ని అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇతడికి అప్పటికే ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ఇతడితో గొడవపడి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం రెండో భార్య ఇతడి వద్దే ఉంటోంది. ఈ విషయం దాచి పెట్టిన జితేంద్ర.. రూపవతితో స్నేహం (Friendship with young woman) చేశాడు. ఆమె కూడా మాటలు నమ్మి ప్రేమించింది. ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు.
ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు. అయితే ఇటీవల రూపవతి.. తనను వివాహం (marriage) చేసుకోవాలంటూ జితేంద్రపై ఒత్తిడి తెస్తూ ఉండేది. అయినా అతను మాత్రం ఏవేవో సాకులు చూపుతూ వాయిదా వేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి చీరల దుకాణానికి వెళ్లిన రూపవతి.. అటునుంచి అటే ప్రియుడి ఇంటికి వెళ్లింది. తర్వాత ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. ఈ సమయంలో మళ్లీ వారి మధ్య పెళ్లి (Argument over marriage) విషయం గురించి గొడవ జరిగింది. మాటల మధ్యలో జితేంద్ర (Poison tea) టీలో విషం కలిపి రూపవతికి ఇచ్చాడు. టీ తాగిన ఆమె కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకుంది.
తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఎదురింటికి చెందిన పోలీసు వాహనాన్ని తీసుకొచ్చాడు. తన స్నేహితుడి సహకారంతో మృతదేహాన్ని అందులో వేసుకుని వెళ్లి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వచ్చాడు. స్థానికులు మృతదేహానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆ ఫొటో చూసిన కొంతమంది కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చివరకు నిందితుడిని గర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.