Wife: బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దంటూ భర్త తిట్టాడని ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. ఏడుస్తూ ఇంట్లోనే ఉంటుందిలే అనుకున్నాడు కానీ..

ABN , First Publish Date - 2023-04-29T19:22:20+05:30 IST

చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చాలా మంది విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంటారు. తల్లిదండ్రులు మందలించారని పిల్లలు, టీచర్ కొట్టాడని విద్యార్థులు, భర్త తిట్టాడని భార్య.. ఇలా ఎంతో మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో..

Wife: బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దంటూ భర్త తిట్టాడని ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. ఏడుస్తూ ఇంట్లోనే ఉంటుందిలే అనుకున్నాడు కానీ..

చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చాలా మంది విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంటారు. తల్లిదండ్రులు మందలించారని పిల్లలు, టీచర్ కొట్టాడని విద్యార్థులు, భర్త తిట్టాడని భార్య.. ఇలా ఎంతో మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళ్తూ ఉండేది. దీంతో భర్త తరచూ మందలిస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు మళ్లీ గొడవ జరగడంతో భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంది. ఆమె ఇంట్లోనే బాధపడుతూ ఉంటుందిలే అనుకున్నాడు. కానీ చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలరామ్ యాదవ్ అనే వ్యక్తి.. భార్య రీనా యాదవ్ (34) తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. బలరామ్ ఇదే ప్రాంతంలో టైలరింగ్ పని (Tailoring work) చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరి ఆదాయం అంతంతమాత్రమే అయినా దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ ఉండేవి కావు. అయితే రాను రాను వీరి కుటుంబంలో భార్య వల్లే సమస్యలు తలెత్తాయి. రీనా యాదవ్‌కు తరచూ బ్యూటీ పార్లర్‌‌కు (beauty parlour) వెళ్లే అలవాటు ఉండేది. మొదట్లో సమస్య లేకున్నా.. రాను రాను భర్త ఇందుకు ఒప్పుకోనేవాడు కాదు. ‘‘బ్యూటీ పార్లర్‌‌కు వెళ్లడం అవసరమా.. ఇక నుంచి ఇలాంటి పనులు మానుకో’’.. అంటూ కండీషన్ పెట్టాడు.

Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

అయినా రీనా యాదవ్ మాత్రం బ్యూటీ పార్లర్‌‌కు వెళ్తూ ఉండేది. దీంతో ఇటీవల దంపతుల మధ్య గొడవలు (Quarrels between couples) పెరిగిపోయాయి. ఇటీవల ఓ రోజు బలరామ్ తన భార్యను గట్టిగా మందలించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. గురువారం కూడా వీరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. తర్వాత బలరామ్ టైలరింగ్ పనికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రీనా యాదవ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఆమె.. సడన్‌గా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి రాగానే భార్య ఉరికి వేలాడుతుండడం చూసి షాక్ అయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

Updated Date - 2023-04-29T19:22:20+05:30 IST