Share News

Viral: కంగారుగా ఓ కుర్రాడిని ఆస్పత్రికి తెచ్చిన బంధువులు.. ఏమైందని డాక్టర్‌ను అడిగితే ఓ డబ్బాను బయటపెట్టి మరీ..!

ABN , First Publish Date - 2023-12-02T20:29:30+05:30 IST

ఆస్పత్రులకు అప్పుడప్పుడూ వింత వింత కేసులు రావడం చూస్తూనే ఉంటాం. కొందరు రోగులు చిత్రవిచిత్రమైన సమస్యలతో వైద్యుల వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో రోగులను చూసి వైద్యులు షాకైన సందర్భాలు కూడా చాలా చూస్తుంటాం. తాజాగా...

Viral: కంగారుగా ఓ కుర్రాడిని ఆస్పత్రికి తెచ్చిన బంధువులు.. ఏమైందని డాక్టర్‌ను అడిగితే ఓ డబ్బాను బయటపెట్టి మరీ..!

ఆస్పత్రులకు అప్పుడప్పుడూ వింత వింత కేసులు రావడం చూస్తూనే ఉంటాం. కొందరు రోగులు చిత్రవిచిత్రమైన సమస్యలతో వైద్యుల వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో రోగులను చూసి వైద్యులు షాకైన సందర్భాలు కూడా చాలా చూస్తుంటాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. బంధువులంతా కలిసి ఓ కుర్రాడిని కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు వారు తెచ్చిన డబ్బా చూసి వైద్యులు కూడా అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చింద్వారా నగర పరిధి మొఖేద్‌లోని నవల్‌గావ్‌ ప్రాంతానికి చెందిన దేశ్‌ముఖ్ అనే యువకుడు.. స్థానికంగా ఉన్న భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజువారీ పనుల్లో భాగంగా గురువారం ఉదయం తన ఇంట్లోని మొక్కజొన్న బస్తాలను బయటికి తీస్తున్నాడు. కొన్ని బస్తాలను తీయగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బస్తాల మాటు నుంచి సడన్‌గా బయటికి వచ్చిన పాము అతన్ని (snake bit young man) కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులంతా వెంటనే అప్రమత్తమ్యారు. కాటు వేసిన పామును డబ్బాలో వేసుకుని, దేశ్‌ముఖ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Bus Journy: సూట్‌కేసులో 100 తులాల బంగారాన్ని పెట్టుకుని మరీ ఓ మహిళ బస్సు ప్రయాణం.. నిద్రమత్తు రావడంతో..!

viral.jpg

డబ్బాలోని పామును చూసి షాకైన వైద్యులు.. చివరకు విషయం తెలుసుకుని అతడికి చికిత్స ప్రారంభించారు. అయితే పాము కాటు వేయగానే.. కుటుంబ సభ్యులు ముందుగా నాటువైద్యాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. అయితే పరిస్థితి విషమించడంతో చివరకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. యువకుడిని రస్సెల్స్ వైపర్ పాము కాటు వేసిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యువకుడి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే పాము కాటు వేయగానే వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే.. ఇంత సీరియస్ కాకపోయి ఉండేదని వైద్యులు తెలిపారు. పాము కాటు వేసిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral: పిల్లలతో కలిసి చలిమంట వేసుకున్న తల్లి.. సడన్‌గా ఎంటరైన పులి.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-12-02T20:29:33+05:30 IST