Share News

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులను అవాక్కయ్యేలా చేసిన వధువు.. కేఎఫ్‌సీ కూడా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం వెనుక..!

ABN , First Publish Date - 2023-12-05T16:00:26+05:30 IST

తమ పెళ్లి గురించి పది మందీ ప్రత్యేకంగా చర్చించుకోవాలని కొందరు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని ప్రయోగాలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో వధువుకు కొన్నిసార్లు వరుడు షాక్ ఇస్తుంటే.. మరికొన్నిసార్లు...

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులను అవాక్కయ్యేలా చేసిన వధువు.. కేఎఫ్‌సీ కూడా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం వెనుక..!

తమ పెళ్లి గురించి పది మందీ ప్రత్యేకంగా చర్చించుకోవాలని కొందరు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని ప్రయోగాలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో వధువుకు కొన్నిసార్లు వరుడు షాక్ ఇస్తుంటే.. మరికొన్నిసార్లు వధువు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వధువుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వధువు తన పెళ్లికి వచ్చిన బంధువులందరినీ అవాక్కయ్యేలా చేసింది. చివరకు కేఎఫ్‌సీ వాళ్లు కూడా 50శాతం డిస్కౌంట్ ఇచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సింగపూర్‌కు (Singapore) చెందిన ఓ వధువు వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 32ఏళ్ల లాయింగ్ లే వాంగ్ అనే యువతి (young woman) వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. అయితే తన వివాహం ప్రత్యేకంగా ఉండాలని భావించిన వధువు.. ఏదైనా వినూత్నంగా చేయాలని వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ ఐడియా తట్టింది. కేఎఫ్‌సీ చికెన్ (KFC Chicken) ముక్కలతో బోకే తయారు చేస్తే ఎలా ఉంటుందీ.. అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా.. తన ఐడియాలను వివరిస్తూ వెంటనే కేఎఫ్‌సీ సంస్థకు కూడా ఓ మెయిల్ చేసింది. వధువు వినూత్న ప్రయత్నం తమను కూడా ఆకట్టుకోవడంతో కేఎఫ్‌సీ వారు వెంటనే స్పందించారు.

Viral: కంగారుగా ఓ కుర్రాడిని ఆస్పత్రికి తెచ్చిన బంధువులు.. ఏమైందని డాక్టర్‌ను అడిగితే ఓ డబ్బాను బయటపెట్టి మరీ..!

kfc-gift-marriage.jpg

ఆమెకు చికెన్ లెగ్ పీస్‌లతో అలంకరించబడిన ఓ అందమైన బోకే పంపించారు. అలాగే వివాహం సందర్భంగా వారి ఆర్డర్లపై 50శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. వధువు వినూత్న ఆలోచన చూసి పెళ్లికి వచ్చిన అతిథులంతా అవాక్కయ్యారు. వీల్‌చైర్‌పై కూర్చున్న వధువు.. చికెన్ పీస్‌లతో కూడిన బోకేను పట్టుకుని సంతోషంగా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం (Viral photos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు ఆలోచన వెరైటీగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వావ్! ఈ బొకే మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వధువుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: పిల్లలతో కలిసి చలిమంట వేసుకున్న తల్లి.. సడన్‌గా ఎంటరైన పులి.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-12-05T16:00:28+05:30 IST