Crime news: అప్పు తీర్చని మహిళకు రుణదాత చివరి సలహా.. అతడి మాటలకు షాక్ అయిన ఆమె.. ఇష్టం లేకున్నా చివరకు..
ABN , First Publish Date - 2023-04-30T19:46:44+05:30 IST
ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకుంది. అయితే తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేసింది. దీంతో రుణదాత తీవ్ర ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. ఎంత బ్రతిమాలుకున్నా వినిపించుకోని అతను.. చివరగా..
ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకుంది. అయితే తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేసింది. దీంతో రుణదాత తీవ్ర ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. ఎంత బ్రతిమాలుకున్నా వినిపించుకోని అతను.. చివరగా ఓ కండీషన్ పెట్టాడు. అతడి మాటలు విని షాక్ అయిన మహిళ.. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) సివాన్ జిల్లాలోని మైర్వా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహేంద్ర పాండే అనే 40 ఏళ్ల వ్యక్తి.. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, కొన్ని నెలల కిందట మహేంద్ర తన దూరపు బంధువు అయిన ఓ మహిళకు (woman) సుమారు రూ.1లక్ష వరకు నగదును అప్పుగా ఇచ్చాడు. అయితే ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అప్పు సకాలంలో చెల్లించలేకపోయింది. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మహేంద్ర.. తర్వాత నుంచి ఆమెపై ఒత్తిడి తేవడం మొదలెట్టాడు.
Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?
డబ్బులు చెల్లించమని బలవంతం చేస్తుండడంతో... ‘‘కొన్నాళ్లు ఆగండి.. మీ అప్పు మొత్తం తీర్చేస్తా’’.. అని మహిళ బ్రతిమాలుకుంది. అయినా అతను మాత్రం కనికరించలేదు. ఈ క్రమంలో అతడి బుద్ధి పక్కదారి పట్టింది. ఓ రోజు సదరు మహిళ వద్దకు వెళ్లి.. ‘‘ అప్పు తీర్చని పక్షంలో నేను చెప్పినట్లు చెయ్’’.. అంటూ కండీషన్ పెట్టాడు. ‘‘మీ కూతరును నా వద్దకు పంపించు, నేనే చదివించుకుంటా’’.. అని చెప్పడంతో మహిళ షాక్ అయింది. అయినా చేసేదేమీ లేక.. ఫిబ్రవరిలో తన 11ఏళ్ల కూతురును అతడి ఇంటికి పంపించింది.
బాలికను తీసుకెళ్లిన వ్యక్తి కొన్నాళ్ల తర్వాత ఎవరికీ చెప్పకుండా పెళ్లి (man married girl) చేసుకున్నాడు. చివరకు ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి.. ఫిబ్రవరి 17న పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అతడిపై మొన్నటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించారు. శనివారం మహీంద్రను అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.