Viral News: వాంతి వస్తుండడంతో కారు ఆపిన వరుడు.. వెంటనే వాహనం దిగి కేకలు పెట్టిన వధువు.. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో..
ABN , First Publish Date - 2023-04-30T16:41:43+05:30 IST
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. అని ఓ సినీ కవి అన్నట్లు.. కొన్నిసార్లు వారు చెప్పే మాటలకు, జరిగే ఘటనలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్ల సమయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వార్తలు..
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. అని ఓ సినీ కవి అన్నట్లు.. కొన్నిసార్లు వారు చెప్పే మాటలకు, జరిగే ఘటనలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్ల సమయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాంతి వస్తుండడంతో వరుడు కాపు ఆపాడు. దీంతో వెంటనే కారు దిగిన వధువు అరుపులు, కేకలతో డ్రామా క్రియేట్ చేసింది. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో అంతా అవాక్కయ్యారు..
బీహార్‌లో (Bihar) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే వివాహం (marriage) జరిగింది. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం వివాహమైన తర్వాత ఐదు రోజుల పాటు వధువు (bride) .. తన అత్తగారి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దీంతో వివాహమైన అనంతరం వధువు తరపు వారు.. ఆమెకు వీడ్కోలు పలికి అత్తగారింటికి పంపించారు. వధువును కారులో ఎక్కించుకున్న వరుడు (groom) తన ఇంటికి బయలుదేరాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలైన సమస్య వచ్చిపడింది.
అంతవరకూ ఆనందంగా ఉన్న వధువు కారు ఎక్కగానే కంగారుగా కనిపించింది. కొత్త కాబట్టి అలా వుంది.. ఓ రోజు పోతో సర్దుకుపోతుందని అంతా అనుకున్నారు. అత్తగారి గ్రామం దగ్గరపడే కొద్దీ వధువులో ఆందోళన మరింత ఎక్కువైంది. మార్గమధ్యలో కారులో ఉన్న వారికి వాంతికి వస్తుండడంతో ఆపారు. దీంతో వెంటనే వధువు కారు దిగి ఏడుస్తూ గట్టిగా అరవడం (bride started crying) మొదలెట్టింది. ‘‘ రక్షించండి.. రక్షించండి.. నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు’’.. అంటూ కేకలు పెడుతూ ఉంది. అప్పటి వరకూ బాగున్న వధువు.. సడన్‌గా షాక్ అయ్యారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా అరుస్తూనే ఉండడంతో చుట్టుపక్కల వారంతా అక్కడ గుమికూడారు.
వివాహ దుస్తుల్లో ఉన్న వధువు.. కిడ్నాప్ (Kidnapping) చేస్తున్నారని అనడంతో వారు కూడా అవాక్కయ్యారు. చివరకు వరుడు కలుగజేసుకుని వధువు తండ్రికి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న వధువు తండ్రి.. ‘‘కిడ్నాప్ లేదు.. ఏం లేదు.. అత్తగారింటికి వెళ్లడం ఇష్టం లేక ఇలా చేసింది’’.. అని చెప్పడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఆమె బాధ చూసి చివరకు తండ్రితో పాటే పుట్టింటికి పంపించారు. చివరకు గ్రామపెద్దలు, బంధువులు కలుగజేసుకుని నచ్చజెప్పడంతో సమస్య సర్దుమణిగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.