Share News

Viral Video: లిఫ్ట్‌లో ఇద్దరు మహిళల నిర్వాకాన్ని వీడియో తీయబోయిన వ్యక్తి.. కాసేపటికి ఆమె భర్త అక్కడికి రావడంతో.. చివరకు..

ABN , First Publish Date - 2023-10-31T15:25:11+05:30 IST

చాలా మంది తాము తప్పు చేసినా.. ఎదుటి వారిని నిందిస్తూ చివరికి వారిపైనే నేరారోపణలు చేస్తుంటారు. కొందరు మహిళలైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఆడామగా తేడా లేకుండా అందిర పట్లా దురుసుగా ప్రవర్తిస్తుంటాు. ప్రస్తుతం...

Viral Video: లిఫ్ట్‌లో ఇద్దరు మహిళల నిర్వాకాన్ని వీడియో తీయబోయిన వ్యక్తి.. కాసేపటికి ఆమె భర్త అక్కడికి రావడంతో.. చివరకు..

చాలా మంది తాము తప్పు చేసినా.. ఎదుటి వారిని నిందిస్తూ చివరికి వారిపైనే నేరారోపణలు చేస్తుంటారు. కొందరు మహిళలైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఆడామగా తేడా లేకుండా అందిర పట్లా దురుసుగా ప్రవర్తిస్తుంటాు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి వారి బండారం బయటపడుతోంది. తాజాగా, ఇద్దరు మహిళల నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లిఫ్ట్‌లో ఇద్దరు మహిళల నిర్వాకాన్ని చూసి ఓ వ్యక్తి వీడియో తీయబోయాడు. చివరకు మహిళ భర్త అక్కడికి రావడంతో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ సొసైటీ సెక్టార్ 108లో ఇద్దరు మహిళలు లిఫ్ట్‌లోకి వెళ్లారు. ఇందులో ఎలాంటి సమస్యా లేకున్నా వెళ్తూ వెళ్తూ వారు పెంపుడు కుక్కను పట్టుకుని వెళ్లడమే అసలు సమస్యకు దారి తీసింది. వారిద్దరూ కుక్కను పట్టుకుని లిఫ్ట్‌లోకి వెళ్లిన కొద్ది సేపటికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు అక్కడికి వచ్చారు. అయితే మహిళల వెంట కుక్క ఉండడాన్ని (Women with dog in elevator) చూడగానే అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘లిఫ్ట్‌లోకి కుక్కలు తీసుకురావడం ఏంటీ.. వెంటనే కిందకు దిగిపోండి’’.. అని చెబుతూనే మరోవైపు ఫోన్‌లో వీడియో కూడా తీయబోయాడు.

Viral Video: ఇతను డాక్టరా.. లేక శాడిస్టా.. అందరి ముందే రోగి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి..

ఆయన మాటలకు ఇద్దరు మహిళల్లో ఒకామెకు పట్టరాని కోపం వచ్చింది. లిఫ్ట్ దిగిపోమని చెప్పడానికి నువ్వెవరూ.. అంటూ అతడిపై బూతులు తిడుతూ ఫోన్‌ను లాగి పక్కన పడేసింది. ఈ ఘటన ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. గొడవ పెద్దదవడంతో చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. కాసేపటికి సదరు మహిళ భర్త అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకుని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై దాడికి దిగాడు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి విడిపించడంతో గొడవ సర్దుమణిగింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. రెండు వర్గాల మధ్య చర్చల అనంతరం సమస్య సర్దుమణిగిందని చెప్పారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఇంట్లోకి వచ్చిన కొండచిలువను చూసి సంతోషంతో ఎగిరిగంతేసిన యజమాని.. అది మోసుకొచ్చిందేంటో తెలిస్తే అవాక్కవుతారు..

Updated Date - 2023-10-31T15:25:11+05:30 IST