Share News

Viral Video: దాదాపు సగం చచ్చిపోయిన పామును చూసిన పోలీసు.. చివరకు ఒకే ఒక్క పని చేసి ఎలా బతికించాడంటే..

ABN , First Publish Date - 2023-10-25T21:50:12+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సరైన సమయంలో సీపీఆర్ ఇచ్చి ప్రాణాలను కాపాడవచ్చని అందరికీ తెలుసు. చాలా మంది సీపీఆర్ ద్వారా ఎంతో మందికి ప్రాణాలు పోసిన సందర్భాలను చూశాం. ఇలాంటి..

Viral Video: దాదాపు సగం చచ్చిపోయిన పామును చూసిన పోలీసు.. చివరకు ఒకే ఒక్క పని చేసి ఎలా బతికించాడంటే..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సరైన సమయంలో సీపీఆర్ ఇచ్చి ప్రాణాలను కాపాడవచ్చని అందరికీ తెలుసు. చాలా మంది సీపీఆర్ ద్వారా ఎంతో మందికి ప్రాణాలు పోసిన సందర్భాలను చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే మనుషులు కాకుండా మిగతా జీవులనూ సీపీఆర్ ద్వారా కాపాడిన సందర్భాలు చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి అరుదైన ఘటనకు సంబంధించిన వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. దాదాపు సగం చచ్చిపోయిన పామును ఓ పోలీసు కానిస్టేబుల్ బతికించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) నర్మదాపురం జిల్లాలోని సేమరి హరిచంద్ పోలీస్ పోస్ట్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్దకు ఇటీవల ఓ పాము (snake) వచ్చింది. దీంతో భయపడిపోయిన స్థానికులు పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆ పాము ఓ పైపులోకి దూరింది. దీంతో చివరకు దాన్ని చంపే క్రమంలో అందులో వారు పురుగుల మందు పోశారు. ఈ మందు తాగడంతో పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సమాచారం అందుకున్న అతుల్ శర్మ అనే కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని పామును పరిశీలించాడు. వెంటనే దాన్ని పక్కకు తీసుకెళ్లి నీళ్లు పోసి శుభ్రం చేశాడు.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా సామీ.. రోడ్డు మీద వెళ్లే ప్రతీ ఒక్కరూ సడన్‌గా చూసి షాకైపోతున్నారుగా..!

CPR.jpg

తర్వాత దాని బతికించేందుకు సీపీఆర్ చేశాడు. చాలా సార్లు దాని నోట్లోకి (constable gave CPR to snake) గాలి ఊదుతూ సీపీఆర్ ఇచ్చాడు. దీంతో కాసేపటికి ఆశ్చర్యకరంగా పాము స్పృహలోకి వచ్చిది. తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కానిస్టేబుల్ మాట్లాడుతూ తాను 12వ తరగతి చదువుతున్నప్పటి నుంచే పాములను కాపాడి అటవీ ప్రాంతాల్లో వదిలేవాడినని చెప్పాడు. పాములు కనిపిస్తే చంపకుండా తనకు గానీ, స్నేక్ క్యాచర్లకు గానీ సమాచారం అందించాలని సూచించాడు. కాగా, అతడు కాపాడిన పాము.. విషపూరితం కాని ధమన్ జాతికి చెందినది తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral News: పోలీసుల వద్దకు ఏడుస్తూ వచ్చిన 7 ఏళ్ల పిల్లాడు.. ఏమైందని అడిగితే ఆ బాలుడు చెప్పింది విని షాక్.. చివరకు ఊహించని ట్విస్ట్..!

Updated Date - 2023-10-25T21:50:12+05:30 IST