Share News

Viral: ఈ ఊరిని అమ్మేస్తున్నారట.. కళ్లు చెదిరే ధర ఉంటుందనుకుంటే పొరపాటే.. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..!

ABN , First Publish Date - 2023-10-25T18:43:11+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో అన్ని రంగాల వారికి ఉపాధి దొరుకుతోంది. ఇక వివిధ రకాల వస్తువులను విక్రయించేవారికైతే సోషల్ మీడియా అనేది అత్యద్భుత వేదికనే చెప్పాలి. ఇంట్లోని చిన్న పాత వస్తువుల దగ్గర నుంచి వాహనాల వరకూ అనేక రకాలను నెట్టింట విక్రయానికి పెట్టడం చూస్తుంటాం. అయితే...

Viral: ఈ ఊరిని అమ్మేస్తున్నారట.. కళ్లు చెదిరే ధర ఉంటుందనుకుంటే పొరపాటే.. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..!

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో అన్ని రంగాల వారికి ఉపాధి దొరుకుతోంది. ఇక వివిధ రకాల వస్తువులను విక్రయించేవారికైతే సోషల్ మీడియా అనేది అత్యద్భుత వేదికనే చెప్పాలి. ఇంట్లోని చిన్న పాత వస్తువుల దగ్గర నుంచి వాహనాల వరకూ అనేక రకాలను నెట్టింట విక్రయానికి పెట్టడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు విక్రయానికి పెట్టే వస్తువుల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో ఏకంగా ఓ ఊరినే అమ్మకానికి పెట్టేశారు. ఇంతకీ ఈ ఊరి ధర కళ్లు చెదిరేలా ఉంటుందనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..

ఆగ్నేయ యూరోపియన్ (Southeast European) దేశమైన రొమేనియాలో (Romania) ఓ గ్రామం అమ్మకానికి (Village for sale) సిద్ధంగా ఉంది. గ్రామం మొత్తం అమ్మకానికి పెడుతున్నారంటే ఎవరైనా ధర ఎక్కువగా ఉందనుకుంటారు. కానీ దీని ధర తెలిస్తే షాకవకుండా ఉండలేరు. ఓ పెద్ద నగరంలోని పెద్ద బంగ్లా ధర కంటే ఈ గ్రామం ధర తక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గ్రామం అంటే కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా అందమైన సుందరప్రదేశాలతో కూడుకుంది. రోమేనియన్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఆర్కిటెక్చర్, అత్యాధునిక సౌకర్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ గ్రామంలోని ఇళ్లు రంగురంగులుగా కనిపిస్తూ కనులవిందు చేస్తాయి. తలుపులు, పైకప్పు ఇలా అన్నీ ఒక్కో రంగులో ఉండడంతో పాటూ అక్కడి చరిత్రను ప్రతిబింబించేలా ఉంటాయి.

Viral Video: కరెంట్ ఆఫీసు ముందుకు వచ్చిందో ట్రాక్టర్.. తాళ్లతో కట్టి మరీ ఓ మొసలిని దించగానే అంతా షాక్.. అసలు కథేంటో తెలిసి..!

viral-trending-news.jpg

ఇప్పటికీ ఈ ప్రాంతంలోని ప్రజలు రోమేనియన్ సాంప్రదాయాలను (Romanian traditions) పాటిస్తారని స్థానికులు తెలిపారు. ఈ గ్రామంలో అడుగుపెడితే మానసిక ప్రశాంతతో పాటూ వింత ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. సుమారు 2,400 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినబడిన ఈ గ్రామంలో ట్రౌట్‌లతో కూడిన చెరువుతో పాటూ రాతితో చేసిన స్టోర్ రూములు, చెక్క పెవిలియన్, హాట్ టబ్‌‌లు, బార్బెక్యూ జోన్ తదితరాలు ఉన్నాయి. అలాగే ఈ గ్రామంలోని ట్రీ హౌస్‌లు, జిప్ లైన్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇలా అనేక సదుపాయాలు ఉన్న ఈ గ్రామం కేవలం $797,872 (రూ,6,63,59,812.11) కు విక్రయానికి సిద్ధంగా ఉంది. కాగా, ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘‘వావ్! ఇంత అందమైన గ్రామం.. ఇంత తక్కువ ధరకు వస్తోందా’’.. అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Shocking: శాస్త్రవేత్తలనే అవాక్కయ్యేలా చేస్తున్న వింత జీవి.. ఇది మత్స్యకన్యనా..? లేక మమ్మీనా..?

Updated Date - 2023-10-25T19:01:25+05:30 IST