Beautiful Video: ఆహా..! మార్నింగ్ వాక్ వెళ్లినవారికి కనులవిందు.. ఇలాంటి అద్భుతమైన దృశ్యం చాలా అరుదు బాస్!

ABN , First Publish Date - 2023-07-27T13:36:07+05:30 IST

ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌ (Sanjay Gandhi National Park)లో గురువారం ఉదయం ఓ సుందర మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది.

Beautiful Video: ఆహా..! మార్నింగ్ వాక్ వెళ్లినవారికి కనులవిందు.. ఇలాంటి అద్భుతమైన దృశ్యం చాలా అరుదు బాస్!

Beautiful Video: ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌ (Sanjay Gandhi National Park)లో గురువారం ఉదయం ఓ సుందర మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యం మార్నింగ్ వాక్‌ (Morning Walk) వెళ్లిన వారికి కనులవిందును కలిగించింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ముంబైకర్లు ఆ దృశ్యాన్ని చూసి తరించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే అది వారికి ఓ సర్‌ప్రైజ్ కూడా. గురువారం ఉదయం కొందరు ముంబైవాసులు బోరివాలి నేషనల్ పార్క్‌ (Borivali National Park) కు వాకింగ్‌కు వెళ్లారు. అలా నడుచుకుంటు వెళ్తున్నవారికి.. జింకల మంద రోడ్డు దాటడం కనిపించింది. అంతే.. కొద్దిసేపు ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ అలా నిలబడిపోయారు ముంబైకర్లు.

ఈ ఘటన తాలూకు వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ (Indian Forest Service Officer) సుశాంత నంద తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఎప్పటిలాగే, ముంబైవాసులు హడావిడిగా ఉన్నారు. అప్పుడే ఈ అద్భుతమైన దృశ్యం ముంబైలోని బోరివలి నేషనల్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేసేవారిని పలకరించింది. మీకు వీలైతే ఆ జింకలెన్నో లెక్కించండి" అనే లైన్లను ఈ వీడియోకు జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒక నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 28వేల మంది వరకు వీక్షించారు. వెయ్యికి పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

Viral Video: వామ్మో.. సమయానికి సపోర్ట్‌గా రాయి దొరికింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే గల్లంతేగా..!

Updated Date - 2023-07-27T13:39:09+05:30 IST