Crime News: ఛీ..ఛీ.. సమాజం ఎటు పోతోంది.. కన్నతల్లి పైనే ఓ నీచుడు అత్యాచారం.. అవమానం భరించలేక ఆమె తీసుకున్న నిర్ణయమిదీ..!
ABN , First Publish Date - 2023-04-22T21:59:36+05:30 IST
చాలా మందిలో నేర ప్రవర్తనతో పాటూ పైశాసికత్వం రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ఛీ..ఛీ.. సమాజం ఎటు పోతోంది.. అని అనిపిస్తుంటుంది. గురుగ్రామ్‌లో..
చాలా మందిలో నేర ప్రవర్తనతో పాటూ పైశాసికత్వం రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ఛీ..ఛీ.. సమాజం ఎటు పోతోంది.. అని అనిపిస్తుంటుంది. గురుగ్రామ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ నీచుడు కన్న తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తల్లి అవమానం భరించలేక చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
గురుగ్రామ్ (Gurugram) పటౌడి పరిధిలోని గ్రామానికి చెందిన ఓ మహిళ (woman) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఈమె భర్త 20ఏళ్ల క్రితం చనిపోవడంతో తన బావను రెండో వివాహం చేసుకుంది. ఇదిలావుండగా, ఈమె పెద్ద కుమారుడు (eldest son) ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. రోజు రోజుకూ అతను మరీ దారుణంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో అతను పశువులా తయారయ్యాడు. చివరకు కన్న తల్లి పైనే కన్నేశాడు. 2020 నవంబర్ లో ఓ రోజు ఫుల్‌గా తాగొచ్చి.. ఒంటరిగా ఉన్న తల్లిపై అత్యాచారానికి (Indecent behavior) పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.
చివరకు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచానికి గురైనట్లు తేలింది. దీంతో చివరకు మృతురాలి కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. 2020 నవంబర్ 21 నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై వాదోపవాదనలు జరిగిన అనంతరం కోర్టు తాజాగా సంచలన తీర్పు (court's sensational verdict) వెలువరించింది. నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా పేర్కొంటూ.. అతను మరణించే వరకూ జైల్లో ఉంచాలని తీర్పు ఇచ్చింది. అలాగే దోషికి రూ.20,000లు జరిమానా కూడా విధించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.