Indian Army: నీ నిర్ణయానికి సెల్యూట్ అమ్మా.. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ.. చైనా సైనికుల దాడిలో భర్త వీరమరణం పొందిన మూడేళ్లకే..
ABN , First Publish Date - 2023-04-22T19:13:38+05:30 IST
అతను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరాడు. మనసా, వాచా, కర్మనా దేశ సేవలోనే నిమగ్నమయ్యాడు. అయితే విధి అతడిపై చిన్న చూపు చూసింది. ఇండియన్ ఆర్మీలో అంకితభావంతో పని చేస్తున్న అతను చైనా సైనికులు జరిపిన దాడిలో..
అతను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరాడు. మనసా, వాచా, కర్మనా దేశ సేవలోనే నిమగ్నమయ్యాడు. అయితే విధి అతడిపై చిన్న చూపు చూసింది. ఇండియన్ ఆర్మీలో అంకితభావంతో పని చేస్తున్న అతను.. చైనా సైనికులు జరిపిన దాడిలో వీర మరణం పొందాడు. ఈ వార్త విన్న ఆయన కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భర్త వీర మరణం పొందిన మూడేళ్ల తర్వాత అతడి భార్య తీసుకున్న నిర్ణయంపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రేవా జిల్లాకు చెందిన దీపక్ సింగ్ అనే వ్యక్తి ఆర్మీ జవానుగా (Army jawan) దేశానికి ఉత్తమ సేవలు అందించాడు. సుమారు 12ఏళ్ల పాటు ఆయన ఇండియన్ ఆర్మీలో (Indian Army) పని చేశాడు. అయితే 2020 జూన్‌లో గాల్వన్ వ్యాలీలో (Galvan Valley) చైనా సైన్యం జరిపిన దాడిలో దీపక్ సింగ్ వీర మరణం పొందాడు. రేఖా సింగ్ అనే యువతిని వివాహం చేసుకున్న దీపక్ సింగ్‌ను.. వివాహమైన మూడు నెలల తర్వాత లడఖ్‌కు పంపించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే వీర మరణం పొందాడు. దీపక్ సింగ్ తన వైవాహిత జీవితంలో ఎనిమిది నెలలకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. చివరిసారిగా హోలీ సెలవులకు ఇంటికి వచ్చిన అతను.. మళ్లీ త్వరగా వస్తానంటూ విధులకు వెళ్లాడు.
వెళ్లిన మూడు నెలలకే తిరిగిరానిలోకాలకు చేరుకున్నాడు. వీర చక్ర అవార్డు గ్రహీత దీపక్ సింగ్ (veer chakra awardee deepak singh) వీరమరణం పొందిన మూడేళ్ల తర్వాత.. ఆయన భార్య రేఖా సింగ్ ఇప్పుడు ఆర్మీలో ఆఫీసర్ (Army officer) కాబోతోంది. దీంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం ఆమె అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. చెన్నైలో తొమ్మిది నెలల ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 29న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత ఆమెను సైన్యంలోకి నియమిస్తారు. పాసింగ్ ఔట్ పరేడ్ (Passing out parade) కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు రేఖా సింగ్ తెలిపారు. భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేఖా సింగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.