Share News

Crime: ఇలాంటి కొడుకు ఉంటేనేం.. లేకుంటేనేం..? ఈ యువకుడు కన్న తల్లిని ఎందుకు చంపాడో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-02T16:26:58+05:30 IST

నవమాసాలూ మోసి కని పెంచిన తల్లి.. జీవితాంతం తన పిల్లల సంక్షేమమే తన సంతోషంగా బతుకుతుంది. అయితే కొందరు పిల్లలు మాత్రం తల్లిదండ్రుల పట్ల కనీస ప్రేమ కూడా చూపకుండా బాధపెడుతుంటారు. మరికొందరైతే మరింత రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి...

Crime: ఇలాంటి కొడుకు ఉంటేనేం.. లేకుంటేనేం..? ఈ యువకుడు కన్న తల్లిని ఎందుకు చంపాడో తెలిస్తే..!

నవమాసాలూ మోసి కని పెంచిన తల్లి.. జీవితాంతం తన పిల్లల సంక్షేమమే తన సంతోషంగా బతుకుతుంది. అయితే కొందరు పిల్లలు మాత్రం తల్లిదండ్రుల పట్ల కనీస ప్రేమ కూడా చూపకుండా బాధపెడుతుంటారు. మరికొందరైతే మరింత రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం మన కళ్లముందు జరుగుతూనే ఉంటాయి. తాజాగా, హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో తల్లికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాల్సింది పోయి.. చివరకు దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా తీవ్ర సంచంలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని (Haryana) రోహ్‌తక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆజాద్‌గఢ్ సమీపంలోని అమృత్ కాలనీకి చెందిన కాంత (65) అనే వృద్ధురాలు.. తన కుమారుడు సంజయ్‌తో కలిసి ఉంటోంది. ఇదిలావుండగా, సంజయ్ చాలా కాలంగా మద్యానికి (Alcoholic) బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా ఇంటి వద్దే ఉంటూ.. తన తల్లితో డబ్బులు తీసుకుంటూ జల్సాలు చేసేవాడు. ఇటీవల అతను ఇంకా దిగజారిపోయాడు. దీంతో కాంత.. తరచూ కొడుకును ‘‘ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా’’.. అంటూ మందలిస్తూ ఉండేది.

Viral: ఎవరీ పాప..? పెంచుకుంటామంటూ ఆ గ్రామంలోని ప్రజలంతా ఎందుకు ఎగబడ్డారు..? పోలీసుల ఎంట్రీతో ఊహించని సీన్..!

2341.jpg

తాజాగా, మంగళవారం రాత్రి కూడా కొడుకు తాగి రావడంతో తల్లి మందలించింది. వెంటనే ఏదైనా పనిలో చేరమంటూ గట్టిగా చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన సంజయ్.. వంట గదిలోని పాన్ తీసుకుని (Son attack on mother) తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న సంజయ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: హైదరాబాద్‌లో నిరుద్యోగుల పరిస్థితి మరీ ఇంత దారుణంగానా..? ఒక్క ఇంటర్వ్యూకు ఎన్ని వేల మంది వచ్చారో చూస్తే..!

Updated Date - 2023-11-02T16:27:00+05:30 IST