Shocking News: ఒక టీ, రెండు సమోసాలు కలిపి ఖరీదెంతో ఊహించగలరా..? ఈ బిల్లును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-11-01T17:41:27+05:30 IST
నిత్యవసర సరుకులు, వివిధ రకాల తినుబండారాల ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. చిన్న చిన్న పట్టణాల్లో రూ.5నుంచి రూ.10లు ఉండే టీ, కాఫీ ధర.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో రెండితలు, మూడింతలు ఉంటుంది. ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లలో,,
నిత్యవసర సరుకులు, వివిధ రకాల తినుబండారాల ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. చిన్న చిన్న పట్టణాల్లో రూ.5నుంచి రూ.10లు ఉండే టీ, కాఫీ ధర.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో రెండితలు, మూడింతలు ఉంటుంది. ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లలో ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ధరలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక టీ, రెండు సమోసాలకు వేసిన బిల్లు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ముంబై నుంచి కోల్‌కతాకు (Mumbai to Kolkata) విమాన ప్రయాణం చేశాడు. అయితే అతడికి ముంబై ఎయిర్‌పోర్టులో (Mumbai Airport) షాకింగ్ అనుభవం ఎదురైంది. స్నాక్స్ తిందామనే ఉద్దేశంతో రెండు సమోసాలు, ఒక టీ, వాటర్ బాలిల్ (Two samosas, tea, water bowl) తీసుకున్నాడు. అయితే సమోసా తిని టీ తాగాక చివరగా అతడికి ఇచ్చిన బిల్లూ చూసుకుని ఖంగుతిన్నాడు. సమోసాలు, టీ, వాటర్ బాటిల్‌కి కలిపి మొత్తం రూ.490లు బిల్లు వేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లు కట్టిన అతను.. ఆ బిల్లును ఫొటో తీసి, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
ముంబై నుంచి కోల్‌కతాకు విమాన టికెట్ రూ.9,230లు, క్యాబ్‌కు రూ.1,500లు కలిపి ఇంటికి చేరుకోవడానికి మొత్తం 11,220లు అయిందని చెప్పాడు. తన నెల జీతం మాత్రం కేవలం రూ.17,000లు మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తక్కువ ఆదాయం ఉన్నప్పుడు.. రైల్లో వెళ్లాల్సింది’’.., ‘‘తగిన స్థోమత ఉంటేనే విమానంలో వెళ్లాలి’’.., ‘‘రెండు సమోసాలు, టీకి కలిపి మహా అయితే రూ.30 అవుతుంది’’..,, ‘‘ఇంత ధర మరీ దారుణం’’.. అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. వారి వారి ప్రాంతాల్లో ధరలను వివరిస్తూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.