Viral Video: మెట్రో రైల్లో హద్దులు దాటిన ప్రేమ జంట... అంతా చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా..
ABN , First Publish Date - 2023-10-31T16:27:52+05:30 IST
ప్రేమలో ఉన్న వారికి ప్రపంచంతో పని ఉండదంటారు. ఈ మాటను నిజం చేస్తూ చాలా ప్రేమ జంటలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొందరు పార్కుల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ఏకంగా...
ప్రేమలో ఉన్న వారికి ప్రపంచంతో పని ఉండదంటారు. ఈ మాటను నిజం చేస్తూ చాలా ప్రేమ జంటలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొందరు పార్కుల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ఏకంగా రోడ్డుపై బైకులో వెళ్తూ అసభ్యకర పనులు చేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ప్రేమికులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. తాజాగా ఈ మెట్రో రైల్లో ప్రేమ జంట నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అంతూ చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా వారు ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు మెట్రో రైలు ఎక్కారు. ఎక్కిన కాసేపటికి ప్రేయసి తన ప్రియుడిపై తల వాల్చి నిద్రపోయింది. అయితే కాసేపటికి తర్వాత వారి తీరు చూసి అంతా షాక్ అయ్యారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి.. (Lovers kissing on the train) సదరు ప్రేమికులు ముద్దులు పెట్టుకున్నారు.
వారి పక్కనే కొందరు యువతులు కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి ప్రేమ జంట చేసిన పనికి వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రేమికులను మొదటి నుంచీ గమనిస్తున్న ఓ వ్యక్తి.. చివరకు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మెట్రో రైళ్లలో ఇలాంటి పనులు సర్వసాధారమైపోతున్నాయ్’’.. అంటూ కొందరు, ‘‘ప్రేమికుల పిచ్చికి అడ్డూఅడుపూ లేకుండా పోతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 61వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.