Train Video: డబ్బులు పెట్టి టికెట్‌ కొని మరీ చావును ఆహ్వానించడం అంటే ఇదేనేమో.. చేయి వదిలేస్తే ప్రాణం పోయినట్టే..!

ABN , First Publish Date - 2023-06-29T17:28:48+05:30 IST

త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో కొందరు చిత్ర విచిత్రమైన సాహసాలు చేస్తుంటారు. ఒక బైకుపై ఐదు, ఆరుగురు ప్రయాణించడం, బస్సుకు వేలాడుతూ వెళ్లడం, రన్నింగ్ ట్రైన్‌ను వెంటబడి మరీ ఎక్కడం వంటి సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు..

Train Video: డబ్బులు పెట్టి టికెట్‌ కొని మరీ చావును ఆహ్వానించడం అంటే ఇదేనేమో.. చేయి వదిలేస్తే ప్రాణం పోయినట్టే..!

త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో కొందరు చిత్ర విచిత్రమైన సాహసాలు చేస్తుంటారు. ఒక బైకుపై ఐదు, ఆరుగురు ప్రయాణించడం, బస్సుకు వేలాడుతూ వెళ్లడం, రన్నింగ్ ట్రైన్‌ను వెంటబడి మరీ ఎక్కడం వంటి సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహిళలు రైల్లో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తుండడం చూసి అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి లోకల్ రైళ్లు (Local trains) ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే ఇటీవల వైరల్ అవుతున్న వీడియో.. అక్కడి ప్రయాణికుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ప్రయాణికులతో నిండిపోయిన లోకల్ రైల్లో కొందరు మహిళలు (women) డోరు వద్ద వేలాడుతూ ప్రయాణించారు. ఐదుగురు మహిళలు చేతుల సాయంతో డోరు వద్ద వేలాడుతూ కనిపించారు.

Bride Video: ఈ వధువును చూసి జాలి పడుతున్న నెటిజన్లు.. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? వరుడి నిర్వాకం చూస్తే..!

చేయి వదిలేస్తే ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న వారిని చూసి పక్కన మరో రైల్లో వెళ్తున్న వారు షాక్ అయ్యారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బతుకు పోరాటంలో ఇలాంటి సాహసాలు తప్పవు’’.. అని కొందరు, ‘‘ఇదీ ముంబై వాసుల పరిస్థితి’’.. అని మరికొందరు, ‘‘జీవితం ఎంతో విలువైంది.. ఇలాంటి సాహసాలు చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-06-29T17:28:48+05:30 IST