Viral Video: వావ్!.. ఈ గ్రామస్తుల తెలివితేటలు అమోఘం.. అడవి మధ్యలో ఇరుక్కుపోయిన కారును చిన్న ట్రిక్‌తో ఎలా బయటికి తీశారంటే..
ABN , First Publish Date - 2023-09-01T20:33:42+05:30 IST
చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. అడవులు, కొండ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో ప్రయాణం అంటే అంత ఈజీ ఏమీ కాదు. వర్షాకాలంలో అయితే మరిన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. గుంతలు తేలిన రోడ్లు, తెగిపడిన బ్రిడ్జిలు, బురదతో..
చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. అడవులు, కొండ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో ప్రయాణం అంటే అంత ఈజీ ఏమీ కాదు. వర్షాకాలంలో అయితే మరిన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. గుంతలు తేలిన రోడ్లు, తెగిపడిన బ్రిడ్జిలు, బురదతో నిండిన దారుల్లో ప్రయాణం.. వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. అయినా చాలా మంది తెగించి ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వాహనదారుడికి అడవి దారి మధ్యలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇరుకు రోడ్డులో కారు చిక్కుకుపోవడంతో చివరకు స్థానికులు కలుగజేసుకుని చిన్న ట్రిక్‌తో బయటికి తీశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారులో కొండ ప్రాంతంలోకి వెళ్లాడు. అడవి మధ్యలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తుండగా అనుకోని సమస్య ఎదురవుతుంది. కొంచెం దూరం వెళ్లగానే రోడ్డు సగం తెగిపోయి ఉంటుంది. దీంతో కారు ముందుకు (car stuck in the forest) వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. అటు వెనక్కు వెళ్లలేక.. ఇటు ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న సమయంలో స్థానికులు గమనిస్తారు. వెంటనే కారు వద్దకు వెళ్లి సాయం చేస్తారు. అంతా కలిసి చివరికి అద్భుతమైన ట్రిక్‌ను వాడతారు.
సగం తెగిపోయిన రోడ్డుకు చివర వరుసగా నిలబడి, ఇనుప రాడ్ల సాయంతో పెద్ద చెక్క బల్లను పరుస్తారు. ఆ చెక్క కిందపడకుండా తమ భుజాల సాయంతో పట్టుకుంటారు. తర్వాత వాహనాన్ని మెల్లగా దానిపై వెళ్లమని డ్రైవర్‌కు సూచిస్తారు. చివరకు చెక్క బల్లపై కారు సాఫీగా అటువైపు వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు గ్రామస్తులను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆహా!.. ఈ గ్రామస్తుల తెలివితేటలు అమోఘం’’.. అంటూ కొందరు, ‘‘పెద్ద సమస్యలను చిన్న ట్రిక్‌తో పరిష్కరించారు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..