Viral Video: 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. అందరి నోటా ఒకే ఒక్క ప్రశ్న..!

ABN , First Publish Date - 2023-06-22T21:48:49+05:30 IST

‘‘ఆవు గోడ మీదకు ఎక్కి.. పేడ ఎలా వేసిందంటావ్..!’’.. ఈ డైలాగ్ వింటే ఎవరికైనా వెంటనే యమలీల సినిమా గుర్తుకొస్తుంది. భూమి మీదకు వచ్చిన చిత్రగుప్తుడికి గోడ మీద ఉన్న పిడకలను చూసి ఈ సందేహం వస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం...

Viral Video: 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. అందరి నోటా ఒకే ఒక్క ప్రశ్న..!

‘‘ఆవు గోడ మీదకు ఎక్కి.. పేడ ఎలా వేసిందంటావ్..!’’.. ఈ డైలాగ్ వింటే ఎవరికైనా వెంటనే యమలీల సినిమా గుర్తుకొస్తుంది. భూమి మీదకు వచ్చిన చిత్రగుప్తుడికి గోడ మీద ఉన్న పిడకలను చూసి ఈ సందేహం వస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. దాదాపు ఇలాంటి సందేహమే మీకూ వస్తుంది. 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అందరి నోటా ఒకటే సందేహం వస్తోంది. చివరికి అసలు విషయం తెలిసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని (Jammu and Kashmir) గ్రేటర్ కైలాష్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డు పక్కన భవనంపై ఓ స్కూటీ గాలిలో వైర్ల మధ్యన 15 అడుగుల ఎత్తులో (scooty hanging in the air) వేలాడుతూ కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక్కొక్కరుగా అంతా అక్కడ గుమికూడారు. గాలిలో స్కూటీ వేలాడటం ఏంట్రా బాబూ.. అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్కూటీ అక్కడికి ఎలా వెళ్లింది.. అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు.

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం మాయాజాలం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు.. ఆ యువతి ఎవరో కాదండోయ్..!

తర్వాత సంబంధింత అధికారులకు సమాచారం అందించడంతో క్రేన్ సాయంతో కిందకు దించారు. ఆదివారం సాయంత్రం వచ్చిన భారీ ఈదురుగాలులు, తుఫాను దాటికి ఇలా జరిగిందని తెలిసింది. కాగా, స్కూటీ గాల్లో వేలాడుతున్న సమయంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఈ స్కూటీని గాలిలో ఏ క్యూటీ పార్క్ చేసిందబ్బా’’ అని కొందరు, ‘‘స్కూటీకి రెక్కలొచ్చినట్లుగా ఉంది’’.. అని మరికొందరు, ‘‘ఇదేందిది.. ఇలాంటిది మేమెప్పుడూ చూడలేదే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలొచ్చాయి బిడ్డా..? నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో ఇది..!

Updated Date - 2023-06-22T21:48:49+05:30 IST