Viral Video: ఒకే స్కూటీపై ఏకంగా 8 మంది.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి వీడియోను తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-06-22T18:09:22+05:30 IST

తప్పని తెలిసినా చాలా మంది నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. బైకులతో నడి రోడ్డుపై ప్రమాదకర ఫీట్లు చేస్తుంటారు. ఇంకొందరైతే అదే బైకులపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు ప్రయాణిస్తూ పోలీసులకు దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనలకు..

Viral Video: ఒకే స్కూటీపై ఏకంగా 8 మంది.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి  వీడియోను తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

తప్పని తెలిసినా చాలా మంది నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. బైకులతో నడి రోడ్డుపై ప్రమాదకర ఫీట్లు చేస్తుంటారు. ఇంకొందరైతే అదే బైకులపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు ప్రయాణిస్తూ పోలీసులకు దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక స్కూటీపై ఏకంగా 8మంది ప్రయాణించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. స్కూటీపై (Scooty) సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురూ ప్రయాణించడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏడు మంది పిల్లల్ని స్కూటీపై తీసుకెళ్లి.. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. స్కూటీ వెనుక వైపు ఓ పిల్లాడు నిలబడి ఉండగా.. మధ్యలో ముగ్గురు పిల్లలు కూర్చుని ఉన్నారు. మరోవైపు స్కూటీకి ఓ వైపు ఓ పిల్లాడు ప్రమాదకరంగా వేలాడుతుండగా.. ముందు వైపు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంత మంది పిల్లల్ని తీసుకెళ్లడం చూసి మిగతా వాహనదారులంతా అవాక్కయ్యారు. పిల్లలు ఏమాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

Train Accident: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. ప్లాట్ ఫామ్‌పై ఓ వ్యక్తిని ఈడ్చుకెళ్లిన రైలు.. చనిపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు కానీ..!

ప్రమాదమని తెలిసినా అతను మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా వేగంగా వెళ్తున్నాడు. దీనికితోడు కనీసం హెల్మెట్ (Helmet) కూడా పెట్టుకోకుండా బండి నడుపుతున్నాడు. వెనుక మరో వాహనంలో వెళ్తున్న వ్యక్తి.. వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వాళ్ల వల్లే ప్రమాదాలు జరిగేది’’.. అని కొందరు, ‘‘చిన్న పిల్లలను ఇలా తీసుకెళ్లడం చాలా దారుణం’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral News: అట్టముక్కలు అమ్మకునే ఇతడు.. రతన్ టాటాకు ఏమాత్రం తీసిపోడు.. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే..!

Updated Date - 2023-06-22T18:09:22+05:30 IST