Zomato Delivery Boy: చేతిలోనే భోజనం.. కానీ తినడానికి టైమే ఉండదు.. డెలివరీ బాయ్ బతుకులంటే ఇంతే బాసూ..!

ABN , First Publish Date - 2023-06-22T21:06:51+05:30 IST

ఆకలేస్తే బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్లో ఒక్క క్లిక్‌తో.. ఎలాంటి సమయంలోనైనా కోరుకున్న ఆహారం ఇంటి వద్దకే వచ్చేస్తోంది. చాలా మంది ఇదే చూస్తారు గానీ.. దీని వెనుక డెలివరీ బాయ్‌లు ఎంత కష్టపడుతున్నారో మాత్రం ఎవరూ ఆలోచించరు. పొట్టకూటి కోసం ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా..

Zomato Delivery Boy: చేతిలోనే భోజనం.. కానీ తినడానికి టైమే ఉండదు.. డెలివరీ బాయ్ బతుకులంటే ఇంతే బాసూ..!

ఆకలేస్తే బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్లో ఒక్క క్లిక్‌తో.. ఎలాంటి సమయంలోనైనా కోరుకున్న ఆహారం ఇంటి వద్దకే వచ్చేస్తోంది. చాలా మంది ఇదే చూస్తారు గానీ.. దీని వెనుక డెలివరీ బాయ్‌లు ఎంత కష్టపడుతున్నారో మాత్రం ఎవరూ ఆలోచించరు. పొట్టకూటి కోసం ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ఫుడ్ డెలివరీలో నిమగ్నమవుతుంటారు. ఈ క్రమంలో వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం జొమాటో డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. జొమాటో డెలివరీ బాయ్ (Zomato Delivery Boy) ఒకరు బైకును ఓ భవనం ముందు ఆపి, లోపలి నుంచి ఓ పాలిథిన్ కవర్ (Polythene cover) బయటికి తీస్తాడు. అక్కడే ఉన్న కొందరు.. అతను ఏం చేస్తున్నాడా అని వీడియో తీయడం ప్రారంభించారు. పాలిథిన్ కవర్ బయటికి తీసి, అందులోని భోజనాన్ని (eating rice) తినడం ప్రారంభించాడు. విధుల్లో ఉండడంతో ఎక్కడ ఫుడ్ డెలివరీ (Food delivery) ఆలస్యం అవుతుందో అన్న కంగారులో అటూ ఇటూ చూస్తూ త్వరగా త్వరగా భోజనం తినేస్తాడు.

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం మాయాజాలం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు.. ఆ యువతి ఎవరో కాదండోయ్..!

ఆ సమయంలోనూ తన కర్తవ్యాన్ని మర్చిపోని యువకుడిని చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. కొందరు డెలివరీ బాయ్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి (IAS officer) అవ్నీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతా (Twitter account) ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ‘‘అయ్యో! ఇతడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది’’.. అని కొందరు, ‘‘డెలివరీ బాయ్ బతుకులంటే ఇంతే బాసూ’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలొచ్చాయి బిడ్డా..? నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో ఇది..!

Updated Date - 2023-06-22T21:06:51+05:30 IST