Viral Video: పాము తోక పట్టుకుని యువకుడి కోతి చేష్టలు.. పొరపాటున కూడా ఇలాంటి పని మాత్రం చేయకండి..

ABN , First Publish Date - 2023-10-12T17:17:21+05:30 IST

ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండానే కొందరు ఏవేవో సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొందరు ఏకంగా పులులు, సింహాలు, విష సర్పాలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ రీల్స్ మానియాలో పడిపోతున్న ప్రస్తుత తరుణంలో కొందరి తింగరి చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బోనులో...

Viral Video: పాము తోక పట్టుకుని యువకుడి కోతి చేష్టలు.. పొరపాటున కూడా ఇలాంటి పని మాత్రం చేయకండి..

ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండానే కొందరు ఏవేవో సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొందరు ఏకంగా పులులు, సింహాలు, విష సర్పాలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ రీల్స్ మానియాలో పడిపోతున్న ప్రస్తుత తరుణంలో కొందరి తింగరి చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బోనులో ఉన్న క్రూరమృగాలతో చెలగాటం ఆడుతూ కొందరు, పారిపోతున్న పాములను పట్టుకుని ఇబ్బంది పెడుతూ మరికొందరు.. ప్రజల ఆగ్రహానికి గురైన సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి వీడియోలు ఇటీవల చాలా చూశాం. తాజాగా, ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పాము తోక పట్టుకుని డాన్సులు వేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పాముతో చేసిన తింగరి పనులు చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న నాగుపాము తోకను పట్టకున్న అతను పక్కకు లాక్కొచ్చాడు. అంతటితో దాన్ని వదిలేయకుండా.. తోకను పట్టుకుని పాముతో కవ్వింపు చర్యలకు దిగుతాడు. దాన్ని రెచ్చగొడుతూ (young man troubled the cobra) డాన్సులు వేస్తూ ఇబ్బంది పెడతాడు. ఒకానొక దశలో పాము అతడిపై బుసలు కొట్టి భయపెడుతుంది. కానీ యువకుడు మాత్రం దాని కాటు నుంచి తప్పించుకుంటూ పామును ఇబ్బంది పెడుతూనే ఉంటాడు.

Viral Video: దాదాపు ప్రాణం పోయి ఎండిపోయిన ఊసరవెల్లిని.. ఇతను సీపీఆర్ చేసి ఎలా బతికించాడో చూడండి..

పాము పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నా వదలకుండా చిరాకు తెప్పిస్తాడు. మధ్య మధ్యలో పాము చాలా సార్లు అతడిని కాటు వేయాలని ప్రయత్నిస్తుంది. అయితే అదృష్టం బాగుండి.. అతను దాని కాటు నుంచి తప్పించుకుంటాడు. చివరగా తోకను వదలడంతో పాము అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-12T17:17:21+05:30 IST