Viral news: సిగరెట్ తాగుతున్న అమ్మాయిలను రోజూ చాటుగా గమనిస్తూ వచ్చిన వృద్ధుడు.. ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి అతడు చేసిన పనితో..

ABN , First Publish Date - 2023-10-12T20:18:36+05:30 IST

సమాజంలో కొందరు బాధ్యతలు మరచి ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా చాలా మంది యువతీయువకులు చెడు అలవాట్లకు బానిసలై.. ఎక్కడ ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా మారిపోతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలా మందికి కోపం వస్తుంటుంది. అయినా..

Viral news: సిగరెట్ తాగుతున్న అమ్మాయిలను రోజూ చాటుగా గమనిస్తూ వచ్చిన వృద్ధుడు.. ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి అతడు చేసిన పనితో..
ప్రతీకాత్మక చిత్రం

సమాజంలో కొందరు బాధ్యతలు మరచి ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా చాలా మంది యువతీయువకులు చెడు అలవాట్లకు బానిసలై.. ఎక్కడ ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా మారిపోతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలా మందికి కోపం వస్తుంటుంది. అయినా చేసేదీలేమీలేక మిన్నకుండిపోతుంటారు. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వృద్ధుడు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. కేఫ్‌లో కొందరు అమ్మాయిలు రోజూ సిగరెట్లు తాగుతూ ఉండేవారు. రోజూ వారిని చాటుగా గమనిస్తూ వచ్చిన ఓ వృద్ధుడు.. చివరకు ఓ రోజు రాత్రి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లోని లసుడియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక స్కై కార్పొరేట్ సమీపంలో ఉన్న ఓ కేఫ్ వద్దకు నిత్యం చాలా మంది యువతీయువకులు వస్తుంటారు. ఈ సందర్భంగా వారంతా అక్కడ సిగరెట్లు తాగుతుండేవారు. అయితే కొన్నిసార్లు అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చి సిగరెట్లు తాగుతూ ఉండేవారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల విజన్ మాతే అనే వృద్ధుడు కూడా ఈ కేఫ్ వద్దకు వస్తుండేవాడు. ఈ క్రమంలో వృద్ధుడు సిగరెట్ తాగుతున్న అమ్మాయిలను చూసి మొదట షాక్ అయ్యాడు. యువత ఇలా చెడిపోతోందేంటీ.. అని అనుకుని వెళ్లిపోయాడు. అయితే తాను అక్కడికి వచ్చినప్పుడల్లా సదరు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ కనిపిస్తుండేవారు. దీంతో అతడికి పట్టరాని కోపం వచ్చేది.

Viral Video: ఇళ్లలోనే కాదు.. ఆఖరికి ఈ విమానంలోనూ సేమ్ ప్రాబ్లెమ్.. టేకాఫ్ సమయంలో ఏం జరిగిందంటే..

అయితే వారిని ఏమీ అనలేక వెళ్లిపోతూ ఉండేవాడు. ఇలా ప్రతి రోజూ (Young women smoking cigarettes) వారు సిగరెట్ తాగుతూ కనిపించడాన్ని జీర్ణించుకులేకపోయాడు. ఎలాగైనా వారిని అక్కడికి రాకుండా చేయాలని అనుకున్నాడు. ఓ రోజు రాత్రి అతను నేరుగా కేఫ్ (old man set fire to the cafe) వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

Viral Video: పాము తోక పట్టుకుని యువకుడి కోతి చేష్టలు.. పొరపాటున కూడా ఇలాంటి పని మాత్రం చేయకండి..

సీసీ కెమెరా ఫుటేజీలో కేఫ్‌కు వృద్ధుడు నిప్పు పెట్టినట్లు కనిపించడంతో చివరకు విజన్ మాతేను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. యువతరం చెడిపోవడాన్ని చూసి భరించలేక ఇలా చేశానని చెప్పాడు. చివరకు కేఫ్ యజమానికి జరిగిన రూ.5లక్షల నష్టపరిహారాన్ని కూడా వృద్ధుడే చెల్లించాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘తాత మంచి పనే చేశాడు’’.. అని కొందరు, ‘‘ప్రతి ఒక్కరూ ఈయన్ను ఆదర్శంగా తీసుకోవాలి’’.. అని మరికొందరు, ‘‘ఇంకొసారి ఆ అమ్మాయిలు సిగరెట్ తాగాలంటే.. ఈయనే గుర్తుకొస్తాడేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-12T20:18:36+05:30 IST