Crime News: గోడకు తగిలించిన ల్యాప్టాప్ బ్యాగులోంచి కిందపడుతున్న రక్తపు చుక్కలు.. భయం భయంగానే అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..
ABN , First Publish Date - 2023-04-10T21:07:19+05:30 IST
ఆ గ్రామంలో తలుపులు వేసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇంట్లో పరిశీలించారు. లోపల గోడకు తగిలించిన ల్యాప్టాప్ బ్యాగులోంచి రక్తపు చుక్కలు పడుతుండడం చూసి..
ఆ గ్రామంలో తలుపులు వేసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇంట్లో పరిశీలించారు. లోపల గోడకు తగిలించిన ల్యాప్టాప్ బ్యాగులోంచి రక్తపు చుక్కలు పడుతుండడం చూసి ఆశ్చర్యపోయారు. చివరకు భయం భయంగానే అందులో ఏముందా అని ఓపెన్ చేశారు. చివరకు లోపలి దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడా (Delhi Greater Noida) పరిధి దేవ్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీలోని (UP) చందేలి ప్రాంతానికి చెందిన దంపతులు.. పిల్లలతో కలిసి కొన్నేళ్లుగా దేవ్లా గ్రామంలో నివాసం ఉంటున్నారు. భర్త సమీపంలోని ప్రాంతాల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ లాగే ఏప్రిల్ 7న కూడా డ్యూటీకి వెళ్లాడు. అతడి భార్య తన రెండేళ్ల కుమార్తెను (Two year old daughter) ఇంట్లో ఒంటరిగా ఉంచి మార్కెట్కు వెళ్లింది. అయితే ఇంటికి వచ్చి చూస్తే పాప కనిపించలేదు. దీంతో కంగారుపడి ఇల్లు మొత్తం వెతికింది. లోపల లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వెతికారు.
అయినా ఎక్కడా కనిపించకపోవడంతో భర్తకు సమాచారం అందించింది. కంగారుగా ఇంటికి వచ్చిన భర్త.. తెలిసిన వారి వద్ద విచారించాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ క్రమంలో దేవ్లా గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడి ఇంట్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు అతడి ఇంట్లో పరిశీలించారు. గోడకు ఉన్న ల్యాప్టాప్ బ్యాగు (Laptop bag) నుంచి రక్తం కారుతుండడంతో తెరచి చూశారు.
లోపల పాప మృతదేహం (baby dead body) ఉండడం చూసి షాక్ అయ్యారు. ఇదిలావుండగా, నిందితుడి రాఘవేంద్ర.. పాప తండ్రికి సుపరిచితుడు అని తెలిసింది. పాప అదృశ్యంపై కేసు నమోదు చేయడానికి వెళ్లిన సమయంలో ఇతను కూడా ఉన్నాడు. ఎప్పుడైతే పాప మృతదేహం బయటపడిందో.. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పాప పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటాడని, బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.