రైల్వే స్టేషన్‌లో డ్రమ్.. ఎవరూ తీసుకెళ్లకపోవడంతో సిబ్బందికి డౌట్.. అసలు అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..
ABN , First Publish Date - 2023-03-17T18:25:22+05:30 IST
ఆ రైల్వే స్టేషన్.. రైళ్ల రాకపోకలు, వచ్చీ పోయే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఎవరి హడావుడిలో వారు ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఓ డ్రమ్ము.. అనుమానాస్పదంగా కనిపించింది. ఎంత సేపు చూసినా..
ఆ రైల్వే స్టేషన్.. రైళ్ల రాకపోకలు, వచ్చీ పోయే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఎవరి హడావుడిలో వారు ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఓ డ్రమ్ము.. అనుమానాస్పదంగా కనిపించింది. ఎంత సేపు చూసినా దాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీంతో రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. అసలు ఏముందా అనుకుంటూ అనుమానంగానే వెళ్లి ఓపెన్ చేశారు. చివరకు డ్రమ్ములోని దృశ్యం చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని (Karnataka) ఎం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్‍లో (Railway station) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన తమన్నా (27)కు ఇటీవల ఇంతిఖాబ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈమె గతంలో ఇంతిఖాబ్ కజిన్ అఫ్రోజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహమైన కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. తర్వాత కుటుంబ సభ్యులను ఎదిరించి ఇంతిఖాబ్‌ను రెండో పెళ్లి (Second marriage) చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఇంతిఖాబ్ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు మధ్య గొడవలు (quarrels) జరుగుతున్నాయి. ఇంతిఖాబ్ బంధువైన నవాబ్.. తమన్నాపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 12న ఇంతిఖాబ్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఇంటికి వచ్చిన వారితో కొద్ది సేపు సరదాగానే మాట్లాడాడు. తర్వాత ఇంతిఖాబ్ ఒక్కని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు.
అప్పటికే అక్కడ ఎనిమిది మంది ఉండడంతో ఇంతిఖాబ్ భయంతో వారు చెప్పినట్లే చేశాడు. తర్వాత తమన్నాపై అంతా కలిసి దాడి చేసి (Assault on woman), గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం కేసు తమ మీదకు రాకుండా ఉండేందుకు.. తమన్నా మృతదేహాన్ని ఓ డ్రమ్ములో ఉంచి, ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ సమీపంలో పడేసి పారిపోయారు. రైల్వే సిబ్బందికి అనుమానం రావడంతో ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నవాబ్ సహా ఐదుగురి కోసం గాలిస్తున్నారు.