Odisha Train Accident: ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు.. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో సీన్ ఇదీ.. ఓ పారిశుధ్య కార్మికుడు రైలును ఊడుస్తోంటే..!
ABN , First Publish Date - 2023-06-08T15:56:42+05:30 IST
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదం దేశ ప్రజలను ఎంతలా దిగ్భ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 288మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదం దేశ ప్రజలను ఎంతలా దిగ్భ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 288మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు ఇంకా తమ వారి మృతదేహాల కోసం వెతుకులాట సాగిస్తూనే ఉన్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. ఇదిలావుండగా, ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి తీసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) రైలుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బాలాసోర్లోని (Balasore) బహనాగా వద్ద ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు నిద్రపోతున్నారు. మరోవైపు రైల్వే సిబ్బంది బోగీని శుభ్రం చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఇంకొందరు ప్రయాణికులు (Passengers) సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. ఫోన్ పట్టుకున్న వ్యక్తి వీడియో (Video) తీస్తూ కాస్త ముందుకు వెళ్తాడు.
బోగీలో అటూ ఇటూ తిరుగుతూ వీడియో తీస్తుండగా.. సడన్గా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వస్తుంది. పెద్ద కుదుపు రావడంతో ఫోన్ తీస్తున్న వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఒక్కసారిగా చీకటి ఆవరించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక.. ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేయడం మొదలెడతారు. వీడియో అంతటితో ముగుస్తుంది. ఈ వీడియో కోరమాండల్ ఎక్స్ప్రెస్లో తీసిందా.. లేక వేరే రైల్లో తీసిందా అనేది తేలకున్నా.. వీడియో (Viral video) మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.