Viral News: పెళ్లి వేదికపై అతిథుల సమక్షంలో వధువు వింత ప్రవర్తన.. ఆమె డిమాండ్స్‌కు వరుడు కూడా మద్దతు ఇవ్వడంతో చివరకు..
ABN , First Publish Date - 2023-05-12T19:25:09+05:30 IST
పెళ్లిళ్లలో చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు కూడా ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. దీంతో చాలా మంది తమ వివాహ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించడం సర్వసాధారణమైంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువతి.. తన వివాహ వేదికను..
పెళ్లిళ్లలో చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు కూడా ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. దీంతో చాలా మంది తమ వివాహ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించడం సర్వసాధారణమైంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువతి.. తన వివాహ వేదికను సమస్య పరిష్కారానికి వినియోగించుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా పెళ్లి వేదికపై అతిథుల సమక్షంలో తన డిమాండ్స్‌ను వినిపిస్తూ బిగ్గరగా కేకలు పెట్టింది. చివరకు వరుడు కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంతో.. ఈ విషయం చాలా దూరం వెళ్లింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్ (West Bengal) తూర్పు బుర్ధ్వాన్ పరిధి భటర్ ప్రాంతానికి చెందిన అభయ రాయ్ అనే యువతికి (young woman) చట్నీ గ్రామానికి చెందిన రింటు అనే యువకుడితో (young man) వివాహం నిశ్చయమైంది. ఇటీవలే వారి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ప్రస్తుతం వివాహ (marriage) వేదికపై వధువు (bride) నిర్వాకానికి సంబంధించిన వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. పెళ్లి తంతు ముగిసిన అనంతరం వివాహ వేదికపై ఉన్న వధువు అతిథుల సమక్షంలో ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించింది. ‘‘నాకు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగం (teacher job) కావాలి, అర్హత గల వారందరికీ ఉద్యోగాలు ఇప్పించాలి’’.. అంటూ బిగ్గరగా కేకలు పెట్టింది.
Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..
ఉన్నట్టుండి వధువు ఇలా అరుస్తుండడంతో అతిథులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చివరకు విచారిచంగా అసలు విషయం తెలిసింది. సదరు యువతి 2014లో టెట్ పరీక్షలో (Tet test) ఉత్తీర్ణత సాధించింది. అయినా ఆమెకు ఇంత వరకూ ఉద్యోగం రాలేదు. ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ అర్హులైన వారికి ఉద్యోగ నియామకాలను (Job placements) వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన యువతి.. ఎలాగైనా తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావించింది. ఈ క్రమంలో ఆమెకు వివాహం నిశ్చయమైంది. తన డిమాండ్స్‌ని సరికొత్తగా వినిపించాలనే ఉద్దేశంతో వివాహ వేదికను ఎంచుకుంది.
చివరకు విషయం తెలుసుకుని వరుడు కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో (Viral news) వైరల్‌గా మారింది. దీంతో వధువు సమస్యపై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందిస్తున్నారు. బీజేపీ ( BJP) అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఈ ఘటన రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల దయనీయ స్థితిని ఎత్తిచూపుతోందన్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నెటిజన్లు కూడా వధువుకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.