Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..
ABN , First Publish Date - 2023-05-10T16:15:56+05:30 IST
వివిధ రకాల సరుకులతో వెళ్లే వాహనాలు.. ప్రమాదానికి గురైన సందర్భాల్లో అందులోని సరుకును జనం ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కొందరైతే వాహనంలోని వారిని కాపాడదామన్న కనీస కనికరం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..
వివిధ రకాల సరుకులతో వెళ్లే వాహనాలు.. ప్రమాదానికి గురైన సందర్భాల్లో అందులోని సరుకును జనం ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కొందరైతే వాహనంలోని వారిని కాపాడదామన్న కనీస కనికరం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అంతకంటే దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బాలుడు అరటి పండ్లను బండిపై వేసుకుని తీసుకెళ్తుంటాడు. మధ్యలో ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం చివరకు ఏం చేశారంటే..
పాకిస్థాన్‌లోని (Pakistan) షేక్‌పురాలో 2018లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) ప్రస్తుతం మళ్లీ వైరల్‌గా మారింది. ఓ బాలుడు బండిపై అరటి పండ్లు (Bananas) మేసుకుని, గాడిదను కట్టుకుని తీసుకెళ్తుంటాడు. అయితే గుంపులుగా ఉన్న జనం మధ్యలో బండిని (cart) నిలుపుతాడు. అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన జనం.. అందుకు విరుద్ధంగా దౌర్జన్యానికి పాల్పడతారు. ఎవరికి వారు చేతికి చిక్కినట్లు అరటి పండ్లు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ‘‘వద్దు.. తీసుకోవద్దు’’.. అని బాలుడు వేడుకున్నా వారు మాత్రం ఏమాత్రం కనికరం చూపరు. బాలుడిని పక్కకు నెట్టి మరీ అరటి పండ్లను (People carrying bananas) తీసుకెళ్లారు.
Viral Video: లేగదూడ మునిగిపోతుండడం చూసి.. సడన్‌గా నీటిలోకి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే..
దీంతో చివరకు చేసేదేమీ లేక.. బండి పైకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అక్కడికీ వదలని జనం.. బండిని బలవంతంగా ఆపుతూ అరటిపండ్ల కోసం ఎగబడతారు. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతాడు. కాగా, అప్పట్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ జర్నిలిస్ట్ షేర్ చేశాడు. వీడియో వైరల్ అవడంతో పాకిస్తాన్ ఫెడరల్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీస్ స్పదించింది. బాలుడికి ఆర్థిక సాయం ప్రకటించింది. అలాగే స్థానికంగా ఉన్న వివిధ వ్యాపారులు ముందుకు వచ్చి, బాలుడికి ఆర్థిక సాయం అందించారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది.