Viral News: ఈ ముగ్గురినీ కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ.. చాలా అదృష్టవంతులు.. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-05-16T17:10:49+05:30 IST
ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు శిశువులు జన్మించిన ఘటనలు తరచూ ఎక్కడో చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా అరుదైన జననాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త ..
ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు శిశువులు జన్మించిన ఘటనలు తరచూ ఎక్కడో చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా అరుదైన జననాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే ఈ పిల్లలను చూసిన నెటిజన్లు.. ఈ ముగ్గురినీ కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు.. అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ వారు ఇలా అనడానికి గల కారణం ఏంటంటే..
యూకేకి (UK) చెందిన జెన్నీ, జేమ్స్ కాస్పర్ దంపతులకు (couple) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ దంపతులు వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం తపించేవారు. ఈ క్రమంలో వారి ఆశలను నిజ చేస్తూ.. జెన్నీ గర్భం (pregnancy) దాల్చింది. దీంతో ఈ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతి నెలా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేవారు. అయితే 12వ వారంలో జెన్నీకి స్కాన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో ముగ్గురు శిశువులు (Three babies) ఉన్నట్లు గుర్తించారు. ఈ వార్త వారికి మరింత ఆనందాన్ని కలిగించింది.
ఈ క్రమంలో మార్చి 31న తొమ్మది వారాల ముందుగానే జెన్నీ.. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురూ 900 గ్రాముల నుంచి 1కేజీలోపు బరువు ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నెల రోజుల అనంతరం పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జి చేశారు. ఇదిలావుండగా, ముగ్గురు పిల్లలూ ఒకే పోలికలతో జన్మించారని, ఇలాంటి అరుదైన జననాలు (Rare births) 200 మిలియన్లలో ఒకరికి మాత్రమే జరుగుతుంటుందని వైద్యులు తెలిపారు. ఈ వార్త వినగానే సదరు దంపతులు సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అయితే పిల్లలను గుర్తించడం కష్టంగా ఉందని, కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో శిశువుల చేతులకు వేసిన బ్యాండ్‌ల సాయంతో గుర్తించేవారమని తండ్రి తెలిపాడు. కాగా, ఈ కవల పిల్లలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.