Shocking: మూత్ర విసర్జనకై రోడ్డు పక్కన బైక్‌ను ఆపడమే ఆ ముగ్గురు అన్నాదమ్ముళ్ల తప్పయింది.. వారి ప్రాణం ఎలా పోయిందంటే..!
ABN , First Publish Date - 2023-11-02T17:54:02+05:30 IST
ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న వారు ఒక్కసారిగా అంతులోని కష్టాల్లో కూరుకుపోవచ్చు. అలాగే కళ్ల ముందు సంతోషంగా తిరుగుతున్న వారు ఉన్నట్లుండి మృత్యు ఒడిలోకి జారుకోవచ్చు. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన ఘటనలు నిత్యం..
ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న వారు ఒక్కసారిగా అంతులోని కష్టాల్లో కూరుకుపోవచ్చు. అలాగే కళ్ల ముందు సంతోషంగా తిరుగుతున్న వారు ఉన్నట్లుండి మృత్యు ఒడిలోకి జారుకోవచ్చు. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన ఘటనలు నిత్యం మన చుట్టూ చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, హర్యానాలో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న ముగ్గురు అన్నదమ్ములూ.. బైకులో వెళ్తూ రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేసేందుకు ఆపారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని (Haryana) నుహ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బిచౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యారేలాల్ ప్రాంతంలో రాజేష్ అనే వ్యక్తికి కలప దుకాణం ఉంది. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఇటీవల విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేష్ సోదరులైన ధరమ్‌వీర్, ధరమ్‌సింగ్, అమిత్ కలిసి రెండు బైకులపై మంగళవారం ఉదయం ఏదో పని మీద కమాన్ అనే ప్రాంతానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పున్హానా జుర్హెరా రహదారి వద్దకు రాగనే మూత్రవిసర్జన కోసం ఆగారు.
Crime: ఇలాంటి కొడుకు ఉంటేనేం.. లేకుంటేనేం..? ఈ యువకుడు కన్న తల్లిని ఎందుకు చంపాడో తెలిస్తే..!
అయితే అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన బొలేరో ( Boloro vehicle hit the youths) వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధరమ్‌వీర్, ధరమ్‌సింగ్ మృతి చెందారు. ఆమిత్ పరిస్థితి విషమంగా ఉంది. అన్నదమ్ముల మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.