Husband: స్టేషన్లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడో భర్త.. ఏమైందని పోలీసులు అడిగితే.. నా భార్య ఓ ప్రభుత్వోద్యోగి అని చెబుతూనే..
ABN , First Publish Date - 2023-06-21T16:37:00+05:30 IST
తన భార్యను ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానంలో చూడాలనేది భర్త కోరిక. అందుకు తగ్గట్టుగానే తాను కష్టపడుతూ భార్యను బాగా చదివిస్తాడు. భర్త అనుకున్నట్లే చివరకు ఆమె కలెక్టర్ అవుతుంది. తన కోసం అంత కష్టపడిన భర్తను జీవితాంతం ఎంతో..
తన భార్యను ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానంలో చూడాలనేది భర్త కోరిక. అందుకు తగ్గట్టుగానే తాను కష్టపడుతూ భార్యను బాగా చదివిస్తాడు. భర్త అనుకున్నట్లే చివరకు ఆమె కలెక్టర్ అవుతుంది. తన కోసం అంత కష్టపడిన భర్తను జీవితాంతం ఎంతో ప్రేమగా చూసుకుటుంది. ఇది హీరో వెంటకేష్ నటించిన సూర్యవంశం సినిమా కథ. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తల విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. అయితే చివరకు మాత్రం భర్త పరిస్థితి దారుణంగా తయారైంది. పోలీసులను ఆశ్రయించి కన్నీళ్లు పెట్టుకున్న భర్తను విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలహాబాద్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ కుమార్ మౌర్య అనే వ్యక్తి ప్రతాప్‌గఢ్ జిల్లా పంచాయితీ రాజ్ శాఖలో (Panchayat Raj Department) నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతడికి తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తాను ఉన్నత పదవిలో ఉండకపోయినా.. కనీసం తన భార్యను అయినా మంచి స్థానంలో చూడాలని కలలు కన్నాడు. అనుకున్నదే తడవుగా ఇదే విషయాన్ని తన భార్యకు చెప్పి.. ఉన్నత చదువులు చదవాలని ప్రోత్సహించాడు. భార్యను దగ్గరుండి బాగా చూసుకుని అన్నివిధాలా ప్రోత్సహించాడు.
అనుకున్నట్లే ఆమె పీసీఎస్ (Provincial Civil Service) లో ఉన్నత ఉన్నతోద్యోగం సంపాదించింది. భార్యకు మంచి ఉద్యోగం రావడంతో భర్త ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం అతడికి కొంత కాలం కూడా నిలవలేదు. తన ఎదుగుదలకు కారణమైన భర్తను మరింత ప్రేమగా చూసుకోవాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. వేరే వ్యక్తిని ప్రేమించి భర్తను దూరం పెట్టింది. అంతటితో ఆగకుండా ప్రేమికుడితో కలిసి భర్తను చంపాలని కుట్ర పన్నింది. ఈ విషయం తెలుసుకున్న అలోక్.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇటీవల పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు.
Viral news: వామ్మో! ఒక్క నిముషం ఆలస్యం అయ్యున్నా.. బేకరీలో ఇతడు చేసిన నిర్వాకం బయటపడి ఉండేది కాదు..
ఈ విషయం తెలుసుకున్న అలోక్ భార్య (wife) కూడా.. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు న్యాయం చేయకపోవడంతో అలోక్.. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో (Chief Minister Office) ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం.. ఈ కేసుపై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను (Director General of Police) ఆదేశించింది. దీనిపై హోంగార్డు డీజీ మౌర్య మాట్లాడుతూ, అలోక్ ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.