Viral Video: అందరూ డబ్బులు పెట్టి కారు కొంటుంటే.. ఇతను మాత్రం ఏకంగా ఇలా చేశాడేంటీ..

ABN , First Publish Date - 2023-07-15T21:35:29+05:30 IST

‘‘ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపి కట్టెదొక దారి’’.. అన్న చందంగా.. కొందరి ప్రవర్తన, చేష్టలు మిగతా వారికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇంకొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. ఇలాంటి వారు చేసే వినూత్న ప్రయోగాలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు...

Viral Video: అందరూ డబ్బులు పెట్టి కారు కొంటుంటే.. ఇతను మాత్రం ఏకంగా ఇలా చేశాడేంటీ..

‘‘ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపి కట్టెదొక దారి’’.. అన్న చందంగా.. కొందరి ప్రవర్తన, చేష్టలు మిగతా వారికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇంకొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. ఇలాంటి వారు చేసే వినూత్న ప్రయోగాలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింగ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎంత డబ్బులు ఉంటే మాత్రం.. ఎవరైనా ఇలా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కారుకు సంబంధించిన వీడియో (Car viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లక్షల ఖరీదు చేసే కొత్త కారు కొన్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. కారుకు ఇతను చేసిన అలంకరణ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కారు మొత్తం రూపాయి, రెండు రూపాయల (coins decorated on the car) కాయిన్లతో అలంకరించాడు. ఇక కాయిన్ పక్కన మరో కాయిన్.. ఇలా వరుసగా కారు మొత్తం అతికించాడు. దూరం నుంచి చూసే వారికి కారు మొత్తం ధగా ధగా మెరిసిపోతూ కనిపిస్తోంది. కారు రోడ్డుపై వెళ్తుంటో అందరి కళ్లూ దీనిపైనే పడుతున్నాయి.

Viral Video: కుందేలుతో దోస్తీ చేసిన పిల్లి.. చివరకు అచ్చం కుందేలు మాదిరే ఎలా మారిందో చూడండి..

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘ఎంత డబ్బులుంటే మాత్రం.. ఎవరైనా ఇలా చేస్తారా’’, ‘‘డబ్బులు చెట్టుకు కాస్తున్నట్టున్నాయ్’’.., ‘‘ఇలాంటి కారుతో రోడ్డుపైకి వెళ్తే యాక్సిడెంట్లు ఖాయం’’, ‘‘ఏం నాయనా.. గుడి మెట్లపైన కూర్చున్నారా’’.. ‘‘ఈ డబ్బులతో కారు లోపల పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేసుకోవచ్చుగా’’.., ‘‘పిల్లలంతా ఈ కారు వెంట పడటం ఖాయం’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..

Updated Date - 2023-07-15T21:35:29+05:30 IST