Viral Video: భార్య పట్ల వృద్ధుడు చూపించిన ప్రేమను చూసి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-03-19T19:55:00+05:30 IST
జీవితాంతం తోడునీడగా కలిసుండాలనే ఉద్దేశంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు దంపతులు. అయితే వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు ఆ బంధం మధ్యలోనే తెగిపోతుంటుంది. ఇంకొందరు కలిసున్నా.. నిత్యం కలహాలతోనే జీవిస్తుంటారు. మరికొందరు..
జీవితాంతం తోడునీడగా కలిసుండాలనే ఉద్దేశంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు దంపతులు. అయితే వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు ఆ బంధం మధ్యలోనే తెగిపోతుంటుంది. ఇంకొందరు కలిసున్నా.. నిత్యం కలహాలతోనే జీవిస్తుంటారు. మరికొందరు దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి భార్యాభర్తల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే వివాహమై కొత్తలో ఎంత ప్రేమ ఉంటుందో.. వృద్ధాప్యంలోకి వచ్చినా అంతే ప్రేమను కనబరుచుకునే దంపతులనూ చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ వృద్ధుడు తన భార్య పట్ల కనబరుస్తున్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వృద్ధ దంపతులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. అస్సాంకు (Assam) చెందిన ఓ వృద్ధ జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటుంది. మరోవైపు వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వృద్ధ దంపతులు (old couple) వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటారు. అయితే కొంతదూరం వెళ్లగానే వృద్ధుడు అలెర్ట్ అవుతాడు. తన భార్య ఎక్కడ ప్రమాదానికి గురవుతుందో అనుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు.
Viral Video: మరీ ఇంత ఆత్మవిశ్వాసం పనికిరాదు బ్రదర్.. ఇతడు చేసిన విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..
ఇటు వైను ఉన్న భార్యను చేయి పట్టుకుని రోడ్డుకు అటువైపు తీసుకెళ్తాడు. తర్వాత కూడా చేయి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా తన వెంట తీసుకెళ్తాడు. రోడ్డుపై చాలా జాగ్రత్తగా ఉండాలి.. అంటూ చిన్న పిల్లలకు చెప్పినట్లుగా జాగ్రత్తలు చెబుతూ వెళ్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దంపతులు అంటే ఇలా ఉండాలి.. అంటూ కొందరు, భార్యకు ఇలాంటి భర్త కంటే ఇంకేం కావాలి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: గాలి బుడగలను ప్లేట్‌లో వడ్డిస్తున్న చెఫ్.. ఇదేం ఫుడ్ అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..