Viral Video: మరీ ఇంత ఆత్మవిశ్వాసం పనికిరాదు బ్రదర్.. ఇతడు చేసిన విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..
ABN , First Publish Date - 2023-03-19T17:18:20+05:30 IST
ఆత్మవిశ్వాసం ఉండాలి గానీ.. మరీ ఎక్కువ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. కొందరు తమ మీద తాము అత్యంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ క్రమంలో వారు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ.. కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు..
ఆత్మవిశ్వాసం ఉండాలి గానీ.. మరీ ఎక్కువ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. కొందరు తమ మీద తాము అత్యంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ క్రమంలో వారు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ.. కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు యువకులు పది మందిలో హీరో అనిపించుకోవాలనే ఉద్దేశంతో వివిధ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువకుడు బిల్డింగ్ పైనుంచి వెనక్కు తిరిగి దూకాలని చూస్తాడు. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ యువకుడి విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ (viral videos) అవుతోంది. ఓ యువకుడు రీల్స్ (Reels) చేసే క్రమంలో ఓ విచిత్రమైన విన్యాసం (stunts) చేయాలని చూస్తాడు. ఇందుకోసం ఓ బిల్డింగ్ పైకి ఎక్కి అంచున వెనక్కు తిరిగి నిలబడతాడు. వెనక్కు దూకి, గింగిరాలు తిరుగుతూ నేలపై నిలబడాలి అనేది తన ప్లాన్. అయితే ఇందుకోసం ఎలాంటి భద్రతా చర్యలూ తీసుకోకుండా.. నేరుగా విన్యాసం చేసేందుకు సిద్ధపడతాడు. అనుకున్నట్లుగానే ఒక్కసారిగా పైనుంచి వెనక్కు తిరిగి దూకేస్తాడు. గింగిరాలు తిరుగుతూ కిందకు వస్తాడు.
అయితే కింద కాళ్లపై నిలబడే క్రమంలో బ్యాలెన్స్ తప్పుతాడు. దీంతో ధమేల్‌మని వెళ్లకిలా కింద పడిపోతాడు. దెబ్బకు అతడికి చుక్కలు కనపడతాయి. అబ్బా! నడుం విరిగిపోయిందరా నాయానో.. అని అరుస్తాడు. పక్కనే ఉన్న స్నేహితులు (friends) అతన్ని పైకి లేపి పక్కకు తీసుకెళ్తారు. పైకి ఏం నొప్పి లేనట్లు కెమెరా (Camera) ముందు నటిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే.. ఇలాగే జరుగుతుంది.. అని కొందరు, మరోసారి ఇలాచేసి నడుం విరగొట్టుకోకు.. అని ఇంకొందరు సలహా ఇస్తున్నారు.