Viral Video: బూర ఊదగానే నాట్యమాడుతూ బుసకొట్టిన కోబ్రా.. పట్టుకునేలోపు కాటేయడంతో చివరకు వారు చేసిన పని..

ABN , First Publish Date - 2023-03-19T16:03:23+05:30 IST

పాములంటేనే తెలీకుండానే ఒంట్లోకి భయం ఆవహిస్తుంది. అందులోనూ ఇక నాగుపాము దగ్గరికి వచ్చి బుస కొడితే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రాణాలు పోయేంత పని అవుతుంది. కొందరు ఆకతాయిలు ప్రమాదమని తెలిసినా..

Viral Video: బూర ఊదగానే నాట్యమాడుతూ బుసకొట్టిన కోబ్రా.. పట్టుకునేలోపు కాటేయడంతో చివరకు వారు చేసిన పని..

పాములంటేనే తెలీకుండానే ఒంట్లోకి భయం ఆవహిస్తుంది. అందులోనూ ఇక నాగుపాము దగ్గరికి వచ్చి బుస కొడితే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రాణాలు పోయేంత పని అవుతుంది. కొందరు ఆకతాయిలు ప్రమాదమని తెలిసినా విష సర్పాలతో ఆటలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చాలా చూశాం. ఓ వ్యక్తి అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ.. పామును మెడలో వేసుకుంటాడు. అంతటితో ఆగకుండా నోట్లో కూడా పెట్టుకుంటాడు. చివరకు దాని కాటికి బలై ప్రాణాలు పోగొట్టుకున్న వీడియో గతంలో చూశాం. ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురి చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బూర ఊదుతూ పామును పట్టుకోవాలని చూస్తాడు. పొదల్లోంచి బయటికొచ్చిన పాము.. నాట్యమాడుతూ చివరకు అతన్ని కాటు వేస్తుంది. దీంతో వెంటనే వారు ఏం చేశారంటే..

సోషల్ మీడియాలో నాగు పాముకు సంబంధించిన వీడియో (Snake viral videos) ఒకటి వైరల్‌గా మారింది. పొలాల్లోకి కోబ్రా (Cobra) వచ్చిందన్న సమాచారంతో పాములు పట్టే కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్తారు. వారిలో ఓ వ్యక్తి బూర ఊడుతూ పాము జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఓ పొద వద్దకు వెళ్లి బూర ఊదుతాడు. తర్వాత అందులో చేయి పెట్టి ఓ చిన్న పామును బయటికి తీస్తాడు. వెంటనే అక్కడే ఓ పెద్ద కోబ్రా ఉందని గుర్తిస్తాడు. మళ్లీ బూర తీసుకుని ఉదుతాడు. కొద్ది సేపటి తర్వాత అలికిడి చేయగా పొద్దల్లోంచి ఓ కోబ్రా బుస కొడుతూ పడగ విప్పుతుంది. తర్వాత అతను కాసేపు పాము ఎదుట బూర ఊదుతాడు. పాము కూడా అటూ ఇటూ కదులుతూ అతన్ని టార్గెట్ చేస్తుంది. తర్వాత పామును పట్టుకోవాలని ప్రయత్నించగా.. వేలిపై కాటు (snake bite) వేస్తుంది. దీంతో వెంటనే పక్కన ఉన్న వారు అక్కడికి వస్తారు.

ఒకప్పుడు ఏసీ మెకానిక్‌గా అరకొర జీతం.. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదన.. ఫ్రెండ్ చెప్పిన ఒక్క సలహాతో ఈ కుర్రాడి లైఫే మారిపోయింది..!

రక్తం కారుతున్న చోట ఏవో మూలికలు వేసి రుద్దుతూ ఉంటారు. మరో వ్యక్తి అతడి నోట్లో ఏదో మందు కూడా వేస్తాడు. కాసేపు ఇబ్బంది పడ్డ అతను.. మళ్లీ బూర (trumpet) ఊదుతూ చివరకు పామును పట్టుకుంటాడు. ఈ క్రమంలో పాము రెండో సారి అతన్ని కాటు వేస్తుంది. అయినా వదలకుండా దాన్ని పట్టుకుని తీసుకెళ్తారు. చివరకు అతడి పరిస్థితి ఏమైందో ఏమో తెలీదు గానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కాగా, ఇలాంటి పనులు చేయొద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పాము కాటు వేస్తే.. వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లాలి గానీ, మూఢనమ్మకాలు నమ్మి ఇలాంటి నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Viral Video: ఇంట్లో హ్యాపీగా డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లోంచి జూమ్ చేసి మరీ వీడియోను తీసి..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-19T16:14:40+05:30 IST