Viral Video: గొరిల్లా ముందు జస్ట్ చేతులు చాపాడంతే.. చివరకు దాని రియాక్షన్ చూసి అంతా షాక్..

ABN , First Publish Date - 2023-04-30T21:01:30+05:30 IST

జూలలో చాలా మంది ఆకతాయిలు జంతువులతో వెకిలి చేష్టలు చేస్తుంటారు. చివరకు ఏనుగులు, పులులు, సింహాలు, చింపాజీలు, గొరిల్లాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఇబ్బంది పెడుతుంటారు. బోన్లలో ఉన్నాయిగా.. ఏం చేస్తాయనే ధైర్యంతో సైలెంట్‌గా ఉన్న వాటిని కూడా కెలికిమరీ..

Viral Video: గొరిల్లా ముందు జస్ట్ చేతులు చాపాడంతే.. చివరకు దాని రియాక్షన్ చూసి అంతా షాక్..

జూలలో చాలా మంది ఆకతాయిలు జంతువులతో వెకిలి చేష్టలు చేస్తుంటారు. చివరకు ఏనుగులు, పులులు, సింహాలు, చింపాజీలు, గొరిల్లాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఇబ్బంది పెడుతుంటారు. బోన్లలో ఉన్నాయిగా.. ఏం చేస్తాయనే ధైర్యంతో సైలెంట్‌గా ఉన్న వాటిని కూడా కెలికిమరీ పైశాసిక ఆనందం పొందుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు కథ అడ్డం తిరుగుతుంటుంది. తిక్క లేచే జంతువులు చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ గొరిల్లాకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బోనులో ఉన్న గొరిల్లా ముందు ఓ యువకుడు చేతులు చాపి ఎగతాళి చేశాడు. చివరకు దాని రియాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. ఓ యువకుడు జంతు ప్రదర్శన శాలలో (Zoo) జంతువులను చూస్తూ చివరగా గొరిల్లా బోను వద్దకు వెళ్తాడు. అప్పటికే గొరిల్లా (gorilla) కొంచెం చికాకుగా ఉంటుంది. దాని సమీపానికి వెళ్లి రెండు చేతులూ చాపి కాస్త వెటకారంగా ప్రవర్తిస్తాడు. దీంతో గొరిల్లాకు కోపం కట్టలు తెంచుకుంటుంది. మెల్లాగా చేయిను కడ్డీల మధ్యలో నుంచి బయటికి పెట్టి.. సడన్‌గా అతడి షర్ట్‌ను పట్టకుని (Gorilla attack on young man) గట్టిగా లాగుతుంది. ‘‘ తమాషా చేస్తావా.. ఉండు నీ సంగతి చెబుతా’’.. అని దగ్గరికి లాక్కుంటుంది. గొరిల్లా దెబ్బకు ఆ వ్యక్తి భయంతో వణికిపోతాడు. దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా దాని శక్తి ముందు నిలవలేకపోతాడు.

Crime news: అప్పు తీర్చని మహిళకు రుణదాత చివరి సలహా.. అతడి మాటలకు షాక్ అయిన ఆమె.. ఇష్టం లేకున్నా చివరకు..

పక్కనే ఉన్న మరో యువకుడు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. గట్టిగా పట్టుకుని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ‘‘ ఎహే..! నువ్వు పక్కకు వెళ్లు.. వీడి సంగతేంటో చూడాలి’’.. అన్నట్లుగా అతడిని పక్కకు నెట్టేస్తుంది. తర్వాత చొక్కా వదిలి అతడి కాలు పట్టకుని లాగేస్తుంది. దీంతో అతను దాదాపు ప్రాణాల మీద ఆశలు వదిలేస్తాడు. పక్కన ఉన్న వ్యక్తి గొరిల్లాను తన్నగానే అతన్ని మళ్లీ పక్కకు నెట్టేస్తుంది. చివరగా మళ్లీ అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ క్రమంలో అతడి మీద జాలి వేసిందో ఏమో గానీ.. ‘‘ ప్రాణాలతో వదిలేస్తున్నా పో ఇక్కడి నుంచి’’.. అన్నట్లుగా అతడి కాలును వదిలేస్తుంది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral News: వాంతి వస్తుండడంతో కారు ఆపిన వరుడు.. వెంటనే వాహనం దిగి కేకలు పెట్టిన వధువు.. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-04-30T21:01:30+05:30 IST